Waltair Veerayya : వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా చిరంజీవి సంపాదన ఎంత ?

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజా రవితేజ  కీలక పాత్రలో రూపొందిన వాల్తేరు వీరయ్య.. ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. అయితే ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఎంత సంపాదించారో తెలుసా.!?

Advertisement
Chiranjeevi gain how much on Walteru veeraya movie
Chiranjeevi gain how much on Walteru veeraya movie

ఈ సినిమా విడుదలై వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తయింది. మొత్తం మీద ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల షేర్ వసూలు చేయగా 160 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా అలాగే యూ ఎస్ లో కూడా ఈ సినిమా సూపర్ రికార్డుని అందుకుంది. అక్కడ ఈ సినిమా ఏకంగా 2 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టినట్లు టాక్. మెగాస్టార్ ఖాతాలో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహరెడ్ట్ తరువాత 2మిలియన్ డాలర్లు వసూలు చేసిన 3 వ సినిమాగా ఈ సినిమా నిలిచింది.

Advertisement

 

మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.  కాగా ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా కూడా పెద్దగా వసూళ్లు సాధించలేదు. గాడ్ ఫాదర్ సినిమా టోటల్ గా 53.10 కోట్ల షేర్ 96.35 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. దాంతో ఈ సినిమా వసూళ్ల మీద భారీగా ఎఫెక్ట్ పడింది. అందువలన  వాల్తేరు వీరయ్య సినిమాని కూడా లైట్ తీసుకున్నారు జనాలు..

 

వాల్తేరు వీరయ్య అందరి అంచనాలను దాటేసి మరీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల పంట పండించింది.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యి.. సుమారు 7 కోట్ల దాకా లాభాలను తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాతో చిరంజీవి భారీగానే సంపాదించారట. ఈ సినిమాలో చిరంజీవికి తన రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాలలో కూడా 10 శాతం వాటాను తీసుకున్నారట ముందుగానే ఈ డీల్ ఫిక్స్ చేసుకున్నారట.

చిరంజీవి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిరంజీవి ముందుగానే భావించారట. అందుకే ఈ సినిమా లాభాలతో పాటు తన రెమ్యూనరేషన్ తో కలిపి చిరంజీవి బాగానే సంపాదించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

Advertisement