Chiranjeevi : సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది మెగా డాటర్ నిహారిక విడాకులు. మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తన కూతురు నిహారికను జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి చేసిన సంగతి తెలిసిందే 2020 డిసెంబర్ 9న వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. మ్యారీడ్ లైఫ్ ని కూడా ఎంతలా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది నిహారిక. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ దూరంగా ఉంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి..

మెగా ఫాన్స్ ఇప్పటివరకు ఈ వార్తలు ఫేక్ అంటూ కొట్టి పడేస్తూ వచ్చారు. కానీ కొన్ని రోజుల క్రితమే జొన్నలగడ్డ చైతన్య నిహారికతో పెళ్లి జరిగిన ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేశాడు. దాంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు ఊపందుకున్నాయి. ఇంత జరుగుతున్నా కానీ ఈ విషయంపై మెగా కుటుంబం గానీ జొన్నలగడ్డ ఫ్యామిలీ గాని స్పందించడం లేదు. దాంతో ఈ వార్తలు నిజమైన అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు.
నిహారిక విడాకుల విషయంపై వస్తున్న వార్తలు మెగాస్టార్ చిరంజీవి ఓ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విషయంలో ఎవరు ఏ పనిచేయాలన్న ఫైనల్ డెసిషన్ మాత్రం చిరంజీవిదే. ఇప్పటివరకు చిరంజీవి నిర్ణయాలను ఇంట్లో ప్రతి ఒక్కరూ గౌరవించారు కాకపోతే ఈ మధ్యకాలంలో చిరంజీవి నిర్ణయాన్ని అందరూ తప్పు పడుతున్నారు ఎంత వయసు వచ్చింది మంచిదో చెడేదో మాకు తెలుసు అంటూ చిరంజీవి నిర్ణయాన్ని తప్పుపడుతున్నారట. మెగా యువత అందుకే చిరంజీవి ఈ విషయంలో చిరంజీవి ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకే చేసి ఇక ఏ విషయంలోనూ పట్టించుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చారట. ఈ బోల్డ్ నిర్ణయంతో మెగా అభిమానులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ చిరంజీవి కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోరన్న సంగతి అందరికీ తెలిసిందే.