Chiranjeevi – Balakrishna : ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తలపడునున్నారు.. జనవరి 12న బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి విడుదల కానుండగా.. జనవరి 13న చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రానుంది.

అయితే ఈ రెండు సినిమాలలో హీరోయిన్ ఒక్కరే.. ఆమె శృతిహాసన్.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శృతిహాసన్ ను ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు అని ప్రశ్నించగా ఆమె చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..శృతిహాసన్ ను చిరంజీవితో డాన్స్ చేయడం కష్టమా.. లేదంటే బాలయ్యతో డాన్స్ కష్టమా.. ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ..ఎలా ఉందన్న ప్రశ్నలు అడుగగా.. అందుకు బదులుగా శృతిహాసన్ ఇద్దరు ఫాన్స్ ని హర్ట్ కాకుండా.. చాలా తెలివిగా తప్పించుకున్నారు.. ఇద్దరిలో వేరువేరు జోనర్స్ ఉన్నాయి.
మాస్ స్టెప్ వేయడంలో బాలయ్య తోపు.. క్లాస్ మాస్క్ మిక్స్ చేసి కొట్టడంలో చిరంజీవి కేక అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి ఇద్దరికీ సమానంగా ఓటేసింది శృతి.. ఇక ఈ రెండు సినిమాలు హిట్ అయితే శృతి హాసన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ఇక వరుస మూవీ ఆఫర్స్ క్యు కడతాయి.