Telugu Cinema Celebrities : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది హీరోలు ఎక్కువగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగున్న కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలని భార్యలుగా చేసుకున్నారు. ఇకపోతే మన హీరోలు వాళ్ళ అత్తమామల వ్యాపారాలు, ఆస్తుల వివరాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. వారి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
జూ.ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి : టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలలో నుంచి క్రేజ్ ఉన్న నటుడు ఎన్టీఆర్. ఇక ఈయన పెళ్లి 2011 మే 5వ తేదీన చాలా వైభవంగా జరిగింది. అప్పటికే సీనియర్ ఎన్టీఆర్ మనవడు కావడంతో ఈయనకు పెద్దింటి సంబంధమే వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధం కుదిర్చింది కూడా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. చిత్ర పరిశ్రమలు చాలా గ్రాండ్ గా జరిగిన వివాహాల్లో ఎన్టీఆర్ పెళ్లి కూడా ఒకటి.. ఇక ఎన్టీఆర్ మామ లక్ష్మీ ప్రణతి తండ్రి ఎవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు. ఇక లక్ష్మీ ప్రణతి నాన్న ఒక మీడియా సంస్థకు అధిపతి కావడంతో పాటు రియల్ ఎస్టేట్లో కూడా రాణిస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు.
అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి : వీరిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్.. అల్లు అరవింద్ కొడుకు అయిన అల్లు అర్జున్ 2011లో స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నారు. స్నేహారెడ్డి తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. ఇక ఆమె తల్లి కవిత కూడా బిజినెస్ చూసుకుంటుంది . వీరికి నగరంలో విద్యాసంస్థల తో పాటు ఇతర బిజినెస్ లు కూడా ఉన్నాయి.
రామ్ చరణ్ – ఉపాసన : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంపన్నుల ఇంటికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 2012లో ఉపాసనను వివాహం చేసుకోవడం జరిగింది. ఇక అపోలో సంస్థల అధినేత అనిల్ కామినేని కూతురు ఉపాసన. అంతేకాదు వీరికి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్టు సమాచారం.
రానా – మిహికా బజాజ్ :దగ్గుబాటి రానా స్నేహితురాలు డ్యూ డ్రాప్ డిజైన్స్ స్టూడియో వ్యవస్థాపకురాలు అయిన మిహికా బజాజ్ ను 2020 ఆగస్టు 8వ తేదీన వివాహం చేసుకున్నారు. ఇక రామానాయుడు స్టూడియోలో నిశ్చితార్థం, వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక రానా అత్తగారు క్రిసాల జువెలరీస్ కి ఓనర్. అంతేకాదు వీరికి గోల్డ్ సంబంధిత వ్యాపారాలు కూడా ఉన్నాయి.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.