BREAKING : విజయ్ దేవరకొండ , రష్మిక మందాన పెళ్లి డేట్ ఫిక్స్ !?

BREAKING: విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా జంటగా కలిసి నటించిన గీతగోవిందం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో జంటగా నటించారు. ఇలా వీరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.. వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక వీరిద్దరూ విదేశాలలో తరచు ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో వీరి ప్రేమ గురించి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్టు వార్తలు రాగా.. అది నిజం చేస్తూ.. ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రావడంతో.. వీరిద్దరి మధ్య రిలేషన్ పై ఒక క్లారిటీ వచ్చింది.

తాజాగా విజయ్, రష్మిక ఇద్దరు కలిసి దుబాయ్ దుబాయ్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. విజయ్ తాజాగా అక్కడి నుంచి ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇలా ఇద్దరు కలిసి దుబాయిలో ఎంజాయ్ చేయటంతో వీరి మధ్య ప్రేమ బంధం ఉందని నెటిజన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటైతే జంట చూడముచ్చటగా ఉందని వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు.

అయితే వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయిందని.. అందుకే ముందుగా విల్లుద్దరు ఎంజాయ్ చేయడానికి ఫారన్ వాకేషన్ కి వెళ్లారని సమాచారం అందుకే దుబాయ్ లో ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారని.. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని.. ఈపాటికి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని.. ఈ ఏడాది చివర్లో వీళ్ళ పెళ్లి ఘనంగా జరుగుతుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.