తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ నటులలో శర్వానంద్ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వినూత్నంగా ఆయన సినిమాలను ట్రై చేస్తూ వుంటారు. ఇకపోతే శర్వా ఈ ఏడాది రక్షితరెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. అకస్మాత్తుగా జరిగిన ఈ ఫంక్షన్ అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. పరిశ్రమ నుంచి రామ్ చరణ్, అక్కినేని అఖిల్, అదితీరావు ఇంకా అనేకమంది ప్రముఖులు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి నిశ్చితార్థం తర్వాత వివాహం జరగడానికి మంచి ముహూర్తాలను చూసుకుంటారు. అయితే మే నెల కూడా పూర్తికావస్తుండగా శర్వానంద్ వివాహం గురించి ఎటువంటి అప్ డేట్ రాకపోవడం గమనార్హం.
ఈ క్రమంలో వీరి వివాహం ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వ్యాపించాయి. దాంతో ఇక చేసేదేమి లేక శర్వానంద్ టీమ్ రంగంలోకి దిగింది. శర్వానంద్, రక్షిత రెడ్డి పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తి అయ్యాకే పెళ్లిపై ఫోకస్ పెడతామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శర్వా, రక్షిత హ్యాపీగా వున్నారని తెలిపారు. కాగా, జూన్ 2, 3 తేదీల్లో రాజస్థాన్లో పెళ్లి చేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.