Adipurush Trailer: డిసప్పాయింట్ చేసేలా ఉన్న ఆదిపురుష్‌ ట్రైలర్‌

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్‌ సీతగా ఓం రౌత్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఆదిపురుష్‌ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లోనూ ఈ ట్రైలర్ విడుదలయ్యింది. షూటింగ్ ఆల్రెడీ జరుపుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది.

మంగళవారం అంటే ఈరోజు రిలీజ్ అయిన ఆదిపురుష్‌ ట్రైలర్ “ఇది నా రాముని కథ” అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. ఇందులోనే విజువల్స్, లొకేషన్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. మనిషిగా పుట్టి దేవుడిగా మారిన రాముడి గురించి ట్రైలర్‌లో చెబుతూ వెళ్లారు. ప్రభాస్ బాణం, విల్లు పట్టుకొని రాముని అవతారంలో చాలా బాగా కనిపించాడు. రావణాసురుడు సీతను అపహరించడం, అయోధ్య రాజ్యం గురించి చూపించడం, ఆంజనేయుడు తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం, రాముని పట్ల భక్తిని ప్రదర్శించడం, రాముడు రావణుడి మధ్య యుద్ధం జరగడం ట్రైలర్‌లో కనిపింట్రైలర్ చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించింది. ట్రైలర్ తోనే ఓం రౌత్ గూస్ బంప్స్ తెప్పించాడని అనడంలో సందేహం లేదు. కొత్త ట్రైలర్ గతంలో రిలీజ్ అయిన టీజర్ కంటే బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్‌ చక్కగా కనిపించాయి. ఇది అధిక బడ్జెట్ తో తీసిన చిత్రంలా అనిపించింది. కానీ ట్రైలర్ ముగిసే కొద్దీ విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ తగ్గిపోయింది. చివరి యుద్ధ సన్నివేశం టీజర్‌లో మనం చూసినట్లుగానే రిఫైండ్ విజువల్ ఎఫెక్ట్స్‌ కనిపించలేదు. దాంతో సినిమా సగం ఫోర్ విజువల్ ఎఫెక్ట్స్ తో డిసప్పాయింట్ చేస్తుందా అనే సందేహం మొదలయింది. ఇక టీజర్‌లో లాగానే లంకేష్ గురించి పెద్దగా వెల్లడించలేదు. ఇక ఈ సినిమా జూన్ 16న రిలీజ్ కానుంది.