Breaking: ఆ థియేటర్లో ఒక్కరోజుముందే ఆదిపురుష్ ట్రైలర్!

మొదటి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం జూన్ 16, 2023న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ రోజురోజుకీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇందులో భాగంగా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ ట్రైలర్ రేపు రిలీజవుతున్న విషయం అందరికీ తెలిసినదే.

అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు… రెబల్ ఫాన్స్ మరియు తెలుగు మీడియా కోసం AMB సినిమాస్ లో ఈరోజు సాయంత్రం స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ స్క్రీనింగ్ కి దర్శకుడు, హీరోయిన్ కృతి సనన్ రానుండడంతో ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సోషల్ మీడియాని వేదికగా మార్చుకున్నారు. రేపు అనగా, మే 9 వ తేదీన ముంబై లో మీడియా కోసం స్క్రీనింగ్ చేయనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం… 3:22 నిమిషాల నిడివితో ఈ ట్రైలర్ రూపొందనున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం ప్రభాస్ యాక్షన్ తో పాటుగా, ఎమోషన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీఖాన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.