Biggboss6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు తుది దశకు చేరుకుంది.. మరికొన్ని గంటల్లో ఈ షో ముగియనుంది.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు వీరిలో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో చర్చ రసవత్తరంగా సాగుతోంది.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేవంత్ అని.. అతను టైటిల్ విన్నర్ ఒప్పందంతోనే ఆయన్ని హౌస్ లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే రేవంత్ ని బెస్ట్ కంటెస్టెంట్ గా హోస్ట్, మేనేజ్మెంట్ ప్రయత్నం చేశారు అంటున్నారు.

ఇక హౌస్ లో మిగతా వారితో పోలిస్తే రేవంత్ కి ఉన్నంత ఫేమ్ ఇతర కంటెస్టెంట్స్ ఎవరికీ లేదు. సో విన్నర్ గా రేవంత్ టైటిల్ అందుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు.. రన్నర్ పొజీషన్ శ్రీహాన్ దే అంటున్నారు. రన్నర్ పొజీషన్ కోసం ఆదిరెడ్డి, రోహిత్ కూడా పోటీపడే సూచనలు కలవు. ఎందుకంటే ఆదిరెడ్డి, రోహిత్ సైతం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. గేమ్ పరంగా ఆదిరెడ్డి, క్యారెక్టర్ పరంగా రోహిత్ ఆకట్టుకున్నారు.. రోహిత్ బిగ్ బాస్ విన్నర్ అని గూగుల్ తల్లి సెర్చింగ్ లో చెప్పింది.
ఒకవేళ శ్రీహాన్ రన్నర్ అయితే థర్డ్ పొజీషన్ ఆదిరెడ్డికి, ఫోర్త్ పొజీషన్ రోహిత్ కి దక్కనున్నాయట. ఇక కీర్తికి ఫిఫ్త్ పొజీషన్ దక్కనుందట. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఫైనల్ రిజల్ట్స్ ఇవే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ ఉత్కంఠకు, ఊహాగానాలకు కొన్ని గంటల్లో తెరపడనుంది. అయితే నాగార్జున రేవంత్ ను విన్నర్ గా అనౌన్స్ చేసిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇక ఏం జరుగుతుందో చూడాలి.