Big Boss 6 Telugu : మెరీనా హౌస్ నుంచి బయటికి రాగానే బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు..!

Big Boss 6 Telugu : మెరీనా అనడం కంటే.. రోహిత్ మెరీనా అనడం కరెక్ట్.. కలిసి వచ్చినా ఒక్కరినీ మాత్రం బయటకు పంపించాడు బిగ్ బాస్.. ఇక మెరీనా జర్నీలో కూడా రోహిత్ తనతో ఎక్కువ లవ్ సీన్స్ తప్ప ఆట మాత్రం కనిపించలేదు. మొత్తానికి నిన్న మెరీనా ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో రోహిత్ తప్ప ఎవ్వరూ ఎక్కవ బాధపడలేదు. అంతా మెరీనా వెళ్ళిపోతుంది అనుకున్నారు. టాప్ టెన్ వరకు మెరీనా రావడం గ్రేట్ అని తనే ఒప్పుకుంది. బిగ్ బాస్ నాకు మంచి ఛాన్స్ ఇచ్చారని చెప్పింది. ప్యూర్ పర్సన్స్, ఇమ్ ప్యూర్ పర్సన్స్ ఎవ్వరో మెరీనా కు టాక్ ఇవ్వగా.. రోహిత్, రాజ్, కీర్తి, ఆది రెడ్డి, రేవంత్ ను ప్యూర్ పర్సన్స్ గా సెలెక్ట్ చేసింది మెరీనా.

Bigg Boss Telugu merina words viral on social media
Bigg Boss Telugu merina words viral on social media

ఇమ్ ప్యూర్ పర్సన్స్ గా ఇనయ, శ్రీ సత్య, శ్రీహాన్, ఫైమా ను ఆ జాబితాలో పెట్టింది. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి.. బిగ్ బాస్ జర్నీకి ఫుల్స్టాప్ పెడుతూ స్టేజి నుంచి వెళ్ళిపోయింది మెరీనా. అయితే బిగ్ బాస్ షో కి వచ్చేటప్పుడు నేను టాస్క్ లో పార్టిసిపేట్ చేయనని ముందే చెప్పాను. అందుకే నేను ఎన్ని రోజులపాటు హౌస్ లో ఉండగలిగాను. బిగ్ బాస్ కూడా నాకు ముందుగానే టాప్ టెన్ వరకు ఉండే ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఆ అగ్రిమెంట్ ప్రకారమే నేను ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగాను.

ఇప్పుడు టాప్ టెన్ లోకి వచ్చిన తర్వాతే నేను హౌస్ నుంచి బయటకు వచ్చేసాను అంటూ మెరీనా టాప్ సీక్రెట్ లను బయటకు పెట్టింది. ఇక రోహిత్ కూడా ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటాడని కాన్ఫిడెంట్ గా చెప్పింది మెరీనా. జంటగా వచ్చిన మా ఇద్దరికీ రెమ్యూనరేషన్ కంటే కూడా మంచి నేమ్ వచ్చిందని మెరీనా చెప్పింది. మెరీనా మొత్తంగా 24 లక్షల రెమ్యూనరేషన్ పొందినట్లు తెలుస్తోంది. ఇక టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అని మెరీనా ను అడగగా రోహిత్, రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆది రెడ్డి పేర్లను చెప్పింది. మెరీనా అవుట్ అయినా రోహిత్ కనీసం టాప్ ఫైవ్ వరకు ఉంటాడా లేదా అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. బహుశా తను కూడా నెక్స్ట్ వస్తాడా లేదంటే మెరీనా చెప్పినట్టు టాప్ ఫైవ్ లో ఉంటాడా అనేది చూడాలి.