Anchor suma – Rajiv Kanakala :బుల్లితెరపై స్టార్ యాంకర్ సుమ. ఆమె భర్త విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త మళ్ళీ వైరల్ అవుతుంది.. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూలోనూ సుమ ను రాజీవ్ కనకాల తో విభేదాలు ఉన్నాయా..? మీరు ఇద్దరు విడాకులు తీసుకున్నారా..? అని .. గత కొన్నిరోజులుగా రాజీవ్ సుమ విడాకులు తీసుకున్నారని.. వారిద్దరూ విడిగా ఉంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వార్తలో నిజం లేకపోలేదు అని రాజీవ్ బహిరంగంగానే చెప్పాడు.. నేను, సుమ కొన్ని రోజులు విడిగా ఉన్నామని.. కొన్ని విభేదాలు మా మధ్య కూడా వచ్చాయని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సుమ సైతం విడాకులపై స్పందించింది అంటూ మరోసారి ఈ వార్తను వైరల్ చేస్తున్నారు కొంతమంది సుమ ను టార్గెట్ చేస్తూ.. దాంతో మళ్ళీ సుమ స్పందించింది.
రాజీవ్ ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు పెళ్ళై 23 ఏళ్లు అవుతుంది. ఈ 23 ఏళ్లు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. భార్యాభర్తలు అన్నాకా విభేదాలు రావడం సహజం. అదీకాకుండా ఇండస్ట్రీలో ఉన్నవారిపై ఇలాంటి పుకార్లు వస్తూ ఉంటాయి. అది అందరికి తెలిసిన విషయమే.
ఇలా రూమర్స్ వచ్చినప్పుడల్లా నా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ వాటికి చెక్ పెడుతూ ఉంటాను. కొంచెం బాధగానే ఉంటుంది. ఆ గాసిప్స్ విన్నప్పుడు.. కానీ అలవాటు అయిపోయింది. ఇండస్ట్రీలో ఇవన్నీ సాధారణం అని చెప్పుకొచ్చింది. ఇక సుమ వ్యాఖ్యలతో పుకార్లకు చెక్ పడినట్లయ్యింది. అయితే ఈ న్యూస్ మరోసారి తెరపైకి వచ్చింది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది కాకపోతే ఇది ఫేక్ న్యూస్ అంటూ కొంతమంది కొట్టు పారేస్తున్నారు..