Naresh: సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే అయితే ఇప్పటికే మూడు గల్లీలు చేసుకునే నరేష్ మూడో భార్యకు విడాకులు ఇచ్చేసి .. పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు..
ఇక న్యూ ఇయర్ సందర్భంగా పవిత్ర లోకేష్ ని కిస్ చేస్తూ వీడియోని రిలీజ్ చేసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే నరేష్ భార్య రమ్య రఘుపతి మాత్రం తనకు డివోర్స్ ఇచ్చే ప్రసక్తి లేదంటూ.. తనను నమ్మించి మోసం చేశాడంటు నరేష్ పై పలు యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో నరేష్ రమ్య రఘుపతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడో భార్య రమ్య నుంచి తనకి ప్రాణహాని ఉందని కోర్టులో కేసు వేశారు.. తనకు రమ్యతో ప్రాణహాని ఉందని నా ఆస్తి కాజేయడానికి ప్రయత్నిస్తుందని.. నేను ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు ప్రయత్నిస్తుందని.. రమ్య బంధువు అయినా కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేయించి బెదిరించిందని.. తనతో నాకు విడాకులు ఇప్పించాలని కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ వేశారు నరేష్.. రమ్య టార్గెట్ ఏంటంటే.. ఒకటి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం లేదంటే నన్ను చంపేసి నా ఆస్తిని కజేయలని అనుకుంటుంది అని నరేష్ ఆరోపించారు.
10 కోట్లు ఇస్తే రమ్య రఘుపతి కాంప్రమైజ్ అవ్వడానికి సిద్దమని ఒక ఫోన్ కాల్ రికార్డ్ చేసిన వాయిస్ వినిపించారు. ఇవన్నీ కోర్టుకి సమర్పిస్తే రమ్యకు జైలు శిక్ష పడటం గ్యారెంటీ అని పేరున్న న్యాయవాదులు చెబుతున్నారు. అంతే కాదు త్వరలోనే నరేష్ పవిత్ర లోకేష్ గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.