Samantha – Naga Chaitanya : 2017లో సమంత నాగచైతన్య ల వివాహం జరగటం తెలిసిందే. ఆ ఏడాది అక్టోబర్ నెలలో ఇరు కుటుంబాలు ఇష్టపూర్వకంగా వీరి వివాహం చేయడం జరిగింది. ఈ జంటనీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ పేయిర్ అని అంటుండే వాళ్ళు. కానీ సడన్ గా 2021 అక్టోబర్ నెలలో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పుకోవటం చాలామందికి షాక్ కి గురి చేయటం జరిగింది. అసలు ఏ కారణంగా సమంత నాగచైతన్య విడిపోయారు అన్నది కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా తెలియదు. ఇప్పటికీ కూడా వీరిద్దరి విడాకులకు కారణం ఏంటి అన్నది బయట జనాలకు జవాబు లేని ప్రశ్నగానే ఉండిపోయింది. ఆ తర్వాత కెరియర్ పరంగా ఇద్దరూ ఎవరికి వారు బిజీ అయిపోయారు. దీంతో సమంత నాగచైతన్య మళ్ళీ కలిసి బతికే అవకాశం లేదు అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
ఇటువంటి క్రమంలో సమంత చైతన్య మళ్లీ కలవబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. విషయంలోకి వెళ్తే సమంత నాగచైతన్య కలసి చాలా సినిమాలు చేశారు. వాటిలో ఒకటి “మజిలీ”. అయితే ఈ సినిమా విడుదలయ్యి నాలుగు సంవత్సరాలు పూర్తికా వచ్చిన క్రమంలో సినిమా దర్శకుడు శివ నిర్మాణ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఫోర్ ఇయర్స్ ఆఫ్ “మజిలీ” అంటూ.. ..సినిమా ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు. అదేవిధంగా సినిమా తీసిన మేకర్స్ మరియు ప్రొడ్యూసర్స్ అందరికీ ఎక్కువగా సపోర్ట్ చేసిన అక్కినేని నాగచైతన్య మరియు సమంత.. దివ్యాంశాక్ కి నా కృతజ్ఞతలు అంటూ రాసుకురావడం జరిగింది.
శివ నిర్మాణ చేసిన ఈ ట్వీట్ నీ సమంత కూడా రిపోస్ట్ చేసి ఫోర్ ఇయర్స్ ఆఫ్ “మజిలీ” అని లవ్ సింబల్ పెట్టి పోస్ట్ చేయటం వైరల్ అవుతుంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చైతన్యానికి సంబంధించిన పిక్ పై లవ్ సింబల్ పెట్టి సమంత ఫస్ట్ టైం పోస్ట్ చేయడం ఇదే. దీంతో కొంచెం కొంచెంగా కోపం తగ్గించుకుంటుందని ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో… సామ్..చేయ్ కలిసి అవకాశాలు ఉన్నాయని జనాలు చెప్పుకొస్తున్నారు. మరోపక్క వీరిద్దరిని కలపడానికి స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ కూడా ఏదో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు.. ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా సమంత నాగచైతన్య కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ జంట రాబోయే రోజుల్లో కలుస్తుందో లేదో చూడాలి.