Pawan kalyan – Ram : పవన్ – రామ్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలవనుందా .? 

Pawan kalyan – Ram తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసింది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమా థేరీ సినిమాకు రీమేక్ అని..రీమేక్ సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించకూడదు అని పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నేటివిటీ కి తగ్గట్టుగా కథను మార్పులు చేర్పులు చేసి టైటిల్ పేరు కూడా మార్చారు. తాజాగా భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాధ్ భగత్ సింగ్ అని టైటిల్ మార్చారు.

Advertisement
become-a-war-in-between-pawan-and-ram-fans
become-a-war-in-between-pawan-and-ram-fans

అయితే ఇలా టైటిల్ మార్చడంతో రామ్ పోతినేని అభిమానులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ఉస్తాధ్ ఇస్మార్ట్ శంకర్ అనే పదానికి రామ్ కరెక్టుగా సెట్ అయ్యాడు. అంతేకాదు ఇలా చెప్పగానే వెంటనే వినిపించే పేరు రామ్..అలాంటి రామ్ కి కనెక్ట్ అయిన ఈ పేరును పవన్ కళ్యాణ్ కోసం ఎలా ఉపయోగిస్తారు? అంటూ రామ్ అభిమానులు గోల చేస్తున్నారు . ఇలా అటు పవన్ కళ్యాణ్ అభిమానులు.. రామ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ మొదలైంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement