Chiranjeevi : ఆ హీరోయిన్ వల్లే చిరంజీవి సినిమా ఆగిపోయిందా.. కారణం?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా విపరీతంగా పాపులారిటీని దక్కించుకున్న ఈయన తనకు సంబంధించిన ఏ ఒక్క విషయమైనా బయటకు వచ్చిందంటే చాలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే చిరంజీవి సినిమా ఒక హీరోయిన్ వల్ల ఆగిపోయింది అంటే ఎవరికి నమ్మాలని అనిపించదు. కానీ అదే నిజం ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement
because-of-that-heroine-chiranjeevi-movie-will-stop
because-of-that-heroine-chiranjeevi-movie-will-stop

ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ శ్రీదేవి.. ఈమెకు స్టార్ హోదా రాగానే అలాగే బాలీవుడ్ , టాలీవుడ్ రెండు పరిశ్రమల్లో కూడా తన హవా కొనసాగించింది. ఆ సమయంలోనే శ్రీదేవి చేసిన పని కారణంగా చిరంజీవికి కోపం వచ్చి రెండు సినిమాలను ఆపేశాడు. ఆ సినిమాలే మధురాల దొంగ, కొండవీటి దొంగ. కొండవీటి దొంగ సినిమాలో శ్రీదేవి కొన్ని మార్పులు చేసి సినిమా పేరు కొండవీటి రాణి అని పెట్టాలని చెప్పడంతో చిరు ఆమెతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. అలా ఆ కొండవీటి దొంగ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత అదే సినిమాని విజయశాంతి , రాధ తో కలిసి చేసి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు చిరంజీవి . ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే శ్రీదేవి కాంబినేషన్లో రావాల్సిన ఈ సినిమా ఆమె ప్రవర్తన వల్లే మిస్ అయ్యిందని చెప్పవచ్చు.

Advertisement
Advertisement