Singer Sunitha : సింగర్ సునీతని పోలీస్ స్టేషన్ వరకూ లాగిన ఆ దుర్మార్గుడు ఎవడో కాదు ! 

Singer Sunitha :  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన పని తాను చేసుకుపోతూ వివాదాలకు దూరంగా ఉండే సింగర్స్ లో సింగర్ సునీత కూడా ఒకరు. ఈమెను ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే వాటిని పట్టించుకోదనే విషయం స్పష్టమవుతుంది . ఏ విషయంలోనైనా సరే చాలా ఓపెన్ గా ఉండే సునీత.. ఏ ఒక్కరితో గొడవ పెట్టుకునే అవకాశమే లేదు అని .. ఆమె అభిమానులే కాదు ఆమెతో సన్నిహితంగా ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఈమె చేయని కొన్ని తప్పులకు కొంతమంది తప్పుగా భావించి ఈమెతో మాట్లాడని సందర్భాలు కూడా ఉన్నాయనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఒక దుర్మార్గుడి కారణంగా సింగర్ సునీత పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది.

Because him.. Sunitha wents to police station..!
Because him.. Sunitha wents to police station..!

అతను ఎవరో కాదు తనను అత్యంత గొప్పగా అభిమానించే ఒక అభిమాని.. దాదాపు పది సంవత్సరాలపాటు సునీత పెట్టే ప్రతి ఫోటోకి లైక్, షేర్ చేస్తూ ఉండడమే కాకుండా నువ్వు చాలా అందంగా ఉన్నావు.. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నన్ను ఎప్పుడు రమ్మంటావు? ఇలా రకరకాలుగా ఆమెను పూర్తిస్థాయిలో ఇబ్బంది పెట్టే వాడట. కానీ ఆమె ఏ రోజు కూడా అతడి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. కానీ దాదాపు పది సంవత్సరాల పాటుగా అలాగే అతడు మెసేజ్ చేసేసరికి తాను కూడా మెసేజ్ చేసిందట. అయితే ఒక అభిమాని కోసం మాత్రమే మెసేజ్ చేసింది కానీ ఇంకో ఉద్దేశం లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సునీత చెప్పుకొచ్చింది.

అయితే ఒకరోజు సునీత ఇంటికి నేరుగా అతడు వచ్చి.. సునీత నన్ను ఇంటికి రమ్మన్నది.. నాతో స్నేహం చేస్తానని చెప్పింది.. అని నేరుగా సునీత తండ్రి తోనే అతడు చెప్పాడట. అయితే ఈ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేక అతడి పీడ విరగడ అవ్వాలంటే ఏదైనా మార్గం ఆలోచించాలని అనుకున్న సునీత. నేరుగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి.. కేస్ కూడా ఫైల్ చేయించిందట . కానీ.. మీరు ఒక సెలబ్రిటీ.. కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగితే మీ పరువు పోతుంది అని అక్కడ పోలీసులు నచ్చ చెప్పడంతో ఆ కేసు నుంచి ఆమె విత్ డ్రా అయినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఒక అభిమాని వీరప్రేమ వలన ఆమె పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు సమాచారం.