Balakrishna : హోస్ట్ గా దూసుకుపోతున్న బాలయ్య …

Balakrishna : సినీ ప్రపంచంలో తనదైన శైలిలో ప్రేక్షకులని అలరించాడు నందమూరి బాలకృష్ణ. భారీ మాస్ డైలాగ్స్ ప్రజెంట్ చేయడం అంటే అది బాలయ్య బాబు తరువాతే అంటారు బాలయ్య బాబు అభిమానులు. సినిమాలోనే కాదు ఓటీటీ లో కూడా తన సత్తా చాటడాన్నికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు నందమూరి హీరో. ఓటీటీ ప్లాట్ ఫారం అయినా ఆహ లో UN STOPPABLE WITH NBK అనే షో తో అభిమానుల ముందుకు వచ్చాడు బాలకృష్ణ. అయితే ఈ షో లో తనలో ఎప్పుడు చూడని ఒక్క కొత్త కోణాన్నీ ప్రేక్షకులకు పరిచయం చేసాడు. ఎంతో సరదాగా మాట్లాడతు షో కి వచ్చిన సెలబ్రిటీ లను నవ్విస్తూ, వారి మధురానుభూతులను గుర్తుచేస్తూ, వారి జీవితంలోని చేదు అనుభావాలను స్నేహితుడిలా షేర్ చేసుకుంటూ, ఎంతో హుందాగా షో ను హోస్ట్ చేస్తున్నాడు బాల్లయ్య.

ఇప్పటికే మోహన్ బాబు ఫ్యామిలీ, మాస్ మహారాజ్ రవితేజ్, దగ్గుబాటి రాణా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా కొంతమంది యాక్టర్స్, దర్శకులు ఈ షో కు అతిధులు గా వచ్చారు. ఇఫ్పటికే ఈ షో హక్కులను కొనుగోలు చేసేందుకు పలు టీవీ చానెల్స్ సైతం ఆరాటపడుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య ఈ షో కోసం చేస్తున్న హోం వర్క్ అంతా ఇంతా కాదు. చాలా డెడికేషన్ తో కొత్త తరంతో కలిసి పనిచేస్తూ హిట్ కొట్టారు అనేది ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్న వాదన. మొత్తంగా ఈ షోతో ఆడియన్స్ కు తనపై ఉన్న థింకింగ్‌ను మార్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు బాల్లయ్య. అన్‌స్టాపబుల్ విత్ ఎన్ బీ కె’ షో IMDB (ఇండియన్ మూవీ డేటా బేస్‌)లో చోటు సంపాదించుకుంది. ఈ షో టాప్ 10 రియాలిటీ టీవీలో లిస్టులో చేరినట్టు ప్రకటించింది ఆహ. IMDB 9.4/10 రేటింగ్‌తో దూసుకుపోతుంది. మొత్తంగా బాలయ్య ‘ఆహా’ ఓటీటీ వేదికతో నిజంగా హోస్ట్‌గా ప్రేక్షకులతో ఆహా అనిపిస్తున్నారు.