Veera Simha: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా వీర సింహారెడ్డి విడుదలైన మొదటి రోజు నుంచి సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది.. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను వసూలు చేసింది.. ఇక రెండో రోజు అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ తప్పలేదు. వాల్తేరు వీరయ్య సినిమా ఇంపాక్ట్ వలన వీర సింహా రెడ్డి కి డ్రాప్స్ కొంచం ఎక్కువగా రాగా.. ఇక మూడో రోజు వారసుడు సినిమా రిలీజ్ కూడా ఉండటంతో బాలయ్య సినిమా థియేటర్స్ కాస్త తగ్గాయి కానీ మొత్తం మీద… మూడో రోజు ఈ సినిమా రెండో రోజుతో పోల్చితే మంచి ఆక్యుపెన్సీతో దూసుకుపోతుంది.. మూడో రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం..

మాస్ సెంటర్స్ లో అయిన రాయలసీమలో వీరసింహారెడ్డి మంచి హోల్డ్ ని చూపిస్తుంది. మిగిలిన చోట్ల కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా రెండో రోజుతో పోల్చితే బెటర్ ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉండటంతో.. ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల మేర లో షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం.. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది. యూఏస్ ఓపెనింగ్స్ ఇంకా అదనం. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి జోరుని చూపిస్తూ దూసుకెళ్తుంది . ఇక ఈరోజు ముగిసే సరికి మొత్తం మీద సినిమా ఇదే రేంజ్ లో ఉంటుందా లేక ఇంకా జోరు చూపించి వసూళ్ళని సొంతం చేసుకుంటుందో చూడాలి.