VeeraSimhaReddy : రగిలిపోతోన్న బాలయ్య ఫ్యాన్స్ .. వీరసింహా రెడ్డి ఫ్లాప్ కి అతనే కారణం ? అతని ఇంటిముందు ధర్నా ?

VeeraSimhaReddy :డైరెక్టర్, రచయితగా బీవీఎస్ రవికి మంచి పేరు ఉంది.. ఈ మధ్య బీవీఎస్ రవి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. బాలయ్యతో చేస్తోన్న అన్ స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బీవీఎస్ రవి పేరు మరింతగా మార్మోగిపోతోంది. దర్శకుడు గా సక్సెస్ కాని బీవీఎస్ రవి రైటర్‌గా తన పవర్ చూపిస్తున్నాడు. కానీ వీర సింహ రెడ్డి సినిమా కు మాత్రం అన్యాయం చేశాడంటూ బాలయ్య గోల పెడుతున్నారు.. ఈ విషయంపై బీవీఎస్ రవి స్పందించారు..

Balakrishna Veera Simha Reddy movie that's writting on BVS Ravi but escape on use gopichand malineni
Balakrishna Veera Simha Reddy movie that’s writting on BVS Ravi but escape on use gopichand malineni

బీవీఎస్ రవి నటుడిగా తెరపై ఎక్కువగా కనిపిస్తున్నాడు. క్రాక్ సినిమాలో స్పెషల్‌గా చిన్న రోల్‌ చేశారు. లేటెస్ట్ గా వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య ఇలా రెండు సినిమాల్లోనూ బీవీఎస్ రవి కనిపించాడు. కాగా వీర సింహా రెడ్డి విషయంలో బీవీఎస్ రవి మీద ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వీర సింహా రెడ్డి సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇయనేనట.. ఇది నిజమే నని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి..

 

బాలకృష్ణ, శ్రుతి హాసన్ సీన్లు వీర సింహా రెడ్డి సినిమాలో ఎంతగా విసుగు పుట్టించాయో మనకి తెలుసు. కాస్త ఎబ్బెట్టుగా కూడా అనిపించాయి.. ఆ ఘనకార్యం మన రైటేర్ గారెనట. ఆ సీన్లను, ట్రాక్‌ను బీవీఎస్ రవి రాసినట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది.

 

అయితే ఈ విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన బీవీఎస్ రవి వాటిని ఖండించాడు. తనకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకున్నాడో గానీ.. వాటితో నాకు సంబంధం లేదని.. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే డైరెక్టర్ గోపీచంద్‌ మలినేని అడిగి తెలుసుకోవచ్చు అంటూ బీవీఎస్ రవి చేతులు దులుపుకున్నాడు.

 

అదే ఒక వేళ మంచి సీన్‌ రాసినట్టుగా రూమర్లు వస్తే.. ఇలానే స్పందించేవారా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. వీర సింహ రెడ్డి లో ఆ సీన్స్ వలనే సినిమా కి నెగిటివ్ టాక్ వచ్చింది. అందుకే బాలయ్య ఫ్యాన్స్ బీవీఎస్ రవి ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్దమవుతున్నారట.