Pawan Kalyan – Bala Krishna : బాలయ్య – పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో రేణూ దేశాయ్ .. ” నాకు చెప్పకుండా ఎందుకు పిలిపించారు ” పవన్ సీరియస్ !

Pawan Kalyan – Bala Krishna : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆహా టీం ఈ ఇంటర్వ్యూని చాలా ప్రెస్టిజియస్ గా ప్లాన్ చేస్తున్నారు.. బాలయ్య, పవన్ క్రేజీ కాంబినేషన్ గా వస్తున్న ఈ ఎపిసోడ్ ని ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.. అయితే తాజాగా ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా వెళ్లినట్లు సమాచారం..

బాలకృష్ణ తో చిట్ చాట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ సడన్ గా ఆ షోలోకి రేణు దేశాయ్ రావడం చూసి షాక్ అయ్యాడట.. రేణు దేశాయ్ ని చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఈ షోలోకి తను ఎందుకు వచ్చిందని.. అయినా నాకు చెప్పకుండా ఎందుకు పిలిపించారు అని బాలయ్య పై పవన్ సీరియస్ అయ్యాడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇక రేణు దేశాయ్ ను అక్కడి నుంచి పంపించేసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరముల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ని సెట్స్ లోకి పిలిపించారని సమాచారం అయితే రేణు దేశాయ్ తో ఒక ఐదు నిమిషాల సంభాషణ మాత్రం జరిగిందట.. ఆ క్లిప్పింగ్ ఎపిసోడ్ కి హైలెట్ అవుతుందని.. ఆ షో కి వెళ్లిన పవన్ అభిమాని సోషల్ మీడియాలో చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది..
బాలయ్య పవన్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అన్నది ప్రోమోతో హింట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.