Taraka Ratna : తారకరత్న తరవాత ఆ కుటుంబాన్ని చూసుకోబోయేది బాలయ్యే !

Taraka Ratna : తారకరత్న మరణంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, టిడిపి శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. 23 రోజులపాటు మృత్యుతో పోరాడిన ఆయన శివరాత్రి రోజున శివసన్నిధికి చేరారు. తారకరత్న మరణం ఆయన భార్యను తీవ్రంగా కలిసి వేసింది.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి 39 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడటాన్ని అలేఖ్య రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఆమె అస్వస్థకు గురై ఆసుపత్రిపాలైనట్లు కూడా తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆమె పెద్దనాన్న విజయ్ సాయి రెడ్డి ప్రస్తుత పరిస్థితి, తారకరత్న అంత్యక్రియల విషయమై మీడియాతో మాట్లాడారు.. తారకరత్న ఎంతో మంచి వ్యక్తి అని విజయ్ సాయి రెడ్డి తెలిపారు. ఆయన రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకుంటున్న సమయంలో అనంత లోకాలకు చేరుకోవడం ద్రోరాదుష్టకరమని అన్నారు. తారకరత్న అందరిని ఆప్యాయంగా పలకరించే వారని.. తారకరత్నకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ముందుగా ఒక అమ్మాయి పుట్టిందని.. ఆ తరువాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి కవలలుగా జన్మించారని అన్నారు. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటినుంచి బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారు..

బాలకృష్ణ తారకరత్న ఆరోగ్యం బాగోలేదు అని తెలిసినప్పటి నుంచి ఆయన వెన్నంటే ఉండి మెరుగైన వైద్యం అందేలాగా చూశారు. అలేఖ్య కాస్త మానసిక ఒత్తిడికి లోనైంది. ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కానీ అధైర్య పడాల్సిన అవసరం లేదు. తను ఎంతో ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం అంత తేలికైన విషయం కాదు.

కొన్నాళ్లపాటు ఆమెకు ఈ ఒత్తిడి ఒడిదుడుకులు ఉంటాయి.. తారకరత్న కుటుంబం మా కుటుంబంలో ఒక భాగం అని బాలకృష్ణ చెప్పారు. అలేఖ్య రెడ్డిని ఆమె పిల్లలను వారి బాగోగులను తాము చూసుకుంటామని తెలిపారు. వారితో తత్సంబంధాలు ఉంటాయని చెప్పడం నిజంగా గొప్ప విషయం.

Balakrishna helped a teenage girl cancer patient
Balakrishna helped a teenage girl cancer patient

బాలకృష్ణ కు తారకరత్న ఫ్యామిలీ రుణపడి ఉంటుందని తెలిపారు. దశదినకర్మ ఎప్పుడు అనేది అంత్యక్రియల తర్వాత నిర్ణయిస్తామని విజయ్ సాయి రెడ్డి తెలిపారు.