God Father Movie : గాడ్ ఫాదర్ తో చిరంజీవి అట్టర్ ఫ్లాప్ కొడితే.. మరోపక్క బాలయ్య ఇండియా వైడ్ రికార్డ్ కొట్టాడు చూడండి..!

God Father Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్.. ఈ షో సక్సెస్ ఫుల్ గా సీజన్ వన్ కంప్లీట్ గా చేసుకుంది.. తాజాగా సీజన్ 2 లోకి ఎంటర్ అయ్యింది.. సీజన్ 1 లో వచ్చిన మహేష్ బాబు ఎపిసోడ్ ను అత్యధిక మంది చూసిన అరుదైన రికార్డ్ క్రియేట్ చేయగా.. తాజాగా సీజన్ 2 ఓపెనింగ్ ఎపిసోడ్ తోనే బాలయ్య వండర్ క్రియేట్ చేశాడు..!! అన్ స్టాపబుల్ 2 షో ఓటీటీ నీ షేక్ చేస్తోంది..!

balakrishna creates india wide record
balakrishna creates india wide record

అన్ స్టాపబుల్ 2 షో ఫస్ట్ ఎపిసోడ్ కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాగా.. ఈ ఎపిసోడ్ కేవలం నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయినట్లు ఆహా అధికారికంగా ట్వీట్ చేసింది.. ఇది ఇండియన్ టాక్స్ షోలోనే బిగ్గెస్ట్ అని ట్వీట్ చేయగా.. బాలయ్య నా మజాకానా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.. బాలకృష్ణ హోస్ట్గా వ్యవహారం మొదటి షో ఇదే.. కానీ ఈ ఒక్క షోతోనే బాలయ్య అంచనాలకు అందని విధంగా తన టాక్ షో తో దూసుకెళ్తున్నాడు..

టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎవరు అనగా ముందుగా మెగాస్టార్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పేర్లు వినిపిస్తాయి.. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించినా లేటెస్ట్ చిత్రం గాడ్ ఫాదర్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది అలాగే నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా ఊహించన స్థాయిలో టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకోవటం లేదు.. కానీ బాలయ్య నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కలెక్షన్లను వసూలు చేయగా.. ఇక తను హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబిల్స్ లో ఏకంగా నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ చూసే విధంగా చేసి బాలకృష్ణ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు ఇది టెలివిజన్ ఇండస్ట్రీలోనే ఇండియా వైడ్ రికార్డు అని తెలుస్తోంది.. అన్ స్టాపబుల్ 2 షో ఫస్ట్ తోనే బాలకృష్ణ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేస్తే.. ఈ సీజన్ ముగిసేలోపు ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి..