Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ లో తనకంటు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వందకు పైగా సినిమాలు చేసిన బాలకృష్ణ బాలయ్య అనే బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు.. చిన్నది నుంచి పెద్దల వరకు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు.. బాలకృష్ణ ఓవైపు సినిమాలలో చేస్తున్న మరోవైపు రాజకీయంగా కూడా ఎదుగుతున్నారు.
ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాజకీయం అన్నాక ప్రతిపక్షం విపక్షం తప్పదు బాలయ్య పై విపక్ష నాయకుడైన కొడాలి నాని తరచూ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ హైలైట్ అవుతూనే ఉంటారు.. అలాంటి బాలకృష్ణ కొడాలి నాని ఎదురెదురు పడితే ఆ సీన్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.. ఇప్పుడు అలాంటిదే జరిగింది గుడిలో.. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి..
కొడాలి నాని తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు.. తన భార్య కూతురుతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి కొడాలి నాని ఆలయ ప్రాంగణంలో కనిపించడంతో అభిమానులు కొడాలి నాని చూసి పెద్ద పెద్దగా కేకలు వేశారు. కొడాలి నాని తన అభిమానులను చూస్తూ అభివాదం చేశారు ఇక గుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
నందమూరి బాలకృష్ణ కూడా అదే ఆలయానికి అదే స్లాట్ లో అమ్మవారి గుడికి విచ్చేశారు. బాలయ్యను చూడంగానే అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో బాలకృష్ణ అభిమానులకు అభివాదం చేస్తూ గుడిలోకి వెళ్లారు.. బాలయ్య అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా కొడాలి నాని గుడిలోకి ఎంటర్ అయ్యారు అలా ఇద్దరు ఒకరికి ఎదురుగా ఒకరు ఎదురుపడ్డారు. దాంతో ఈ సీన్ చూసి రెండు రాజకీయ పార్టీల నేతలు ఎదురు వెదురు పడటం విజువల్ వండర్ గా అనిపించింది. అందరికీ దానితో ఈ వీడియోను వైరల్ చేసే పనిలో పడ్డారు ఫాన్స్..