Bala Krishna : సూపర్ స్టార్ కృష్ణ కోసం మ‌హేష్‌ కి కూడా తెలియకుండా కీలక నిర్ణయం తీసుకున్న బాలయ్య .. నువ్ దేవుడు సామీ !!

Bala Krishna : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయం క్రియేట్ చేసుకున్న లెజండ‌రీ న‌టుడు కృష్ణ. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. చికిత్స తీసుకుంటూనే నవంబ‌ర్ 15 తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో తుది శ్వాస విడిచాడు. కృష్ణ‌ మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈయన మరణం పట్ల సినీ సెలబ్రెటీలు, రాజీకీయ నాయ‌కులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.

Advertisement
bala-krishna-took-stunning-decision
bala-krishna-took-stunning-decision

గ్రేట్ బాల‌య్య‌..

కృష్ణ మృతి గురించి తెలుసుకున్న వెంట‌నే వీరసింహా రెడ్డి బృందం కృష్ణ మృతికి నివాళులు అర్పించింది. అనంతపూర్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న స‌మ‌యంలో షూటింగ్‌ లోకేషన్‌లో చిత్ర యూనిట్‌ కృష్ణ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దర్శకుడు గోపిచంద్‌, కన్నడ యాక్టర్‌ దునియా విజయ్‌లతో పాటు యూనిట్‌ సభ్యులు సైతం కృష్ణకు నివాళులు అర్పించారు. కృష్ణ మ‌ర‌ణం ప‌ట్ల‌ హీరో నందమూరి బాలకృష్ణ సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం తెలియ‌జేశారు. తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరింది అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టాడు .

Advertisement

అంతేకాక కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి, అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ని ప‌రామ‌ర్శించారు. అయితే కృష్ణ‌పై బాల‌య్యకు ఉన్న ప్రేమ‌తో ఇప్పుడు త‌ను న‌టిస్తున్న వీర సింహారెడ్డిలో కృష్ణ‌కి ట్రిబ్యూట్‌గా ఓ సాంగ్ పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే దీనికి సంబంధించి స‌న్నాహాలు కూడా చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక బాలకృష్ణ సినిమా వీర సింహా రెడ్డి షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న విష‌యం తెలిసిందే .సంక్రాంతి కి సినిమా విడుదల కావాల్సి ఉంది కనుక షూటింగ్ చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. అయితే కృష్ణ ట్రిబ్యూట్ సాంగ్ మ‌హేష్‌కి కూడా తెలియ‌ద‌ట‌. ఏదేమైన బాల‌య్య నిర్ణ‌యం కృష్ణ అభిమానుల‌కి ఆనందాన్ని క‌ల‌గ‌జేస్తుంది.

Advertisement