Bala Krishna : నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక్కోసారి చిన్నపిల్లాడిలా కనిపిస్తారు. ఇంకోసారి ఉగ్రనరసింహుడిగా కనినిస్తుంటారు. ఆయకి కోపం వచ్చినప్పుడు ఎదుట ఎవరు ఉన్నా కూడా భస్మం కావల్సిందే. గతంలో బాలయ్య సహనం కోల్పోయిన సంఘటనలు చాలానే చూశాం. తాజాగ మరోసారి సహనం కోల్పోయిన ఆయన కాస్ట్యూమ్ వర్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమా చేస్తుండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి.

బాలయ్య ఉగ్ర రూపం..
ఇటీవల ఈ చిత్ర షూటింగ్ టర్కీలో జరగగా, అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన విషయం ఒకటి బయటకు వచ్చింది. సినిమా వర్క్ పట్ల బాలయ్య.. చిత్ర దర్శకుడు, నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ క్రమంలో కాస్ట్యూమ్ వర్కర్ పై కూడా సహనం కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇష్యూ జరిగిన సమయంలో షూటింగ్ లొకేషన్ లో నిర్మాతలు కూడా లేకపోవడంతో బాలయ్య మరింత ఫైర్ అయినట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన వర్క్ దర్శకుడు, నిర్మాతలు దగ్గరుండి చూసుకోవాలి కదా అని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరగుతుంది.
బాలయ్య కోపంతో సదరు కాస్ట్యూమ్ వర్కర్ తీవ్ర మనస్తాపానికి గురి కాగా, ఆ తర్వాత అతడు షూటింగ్ కి కూడా హాజరు కాలేదట. ఆ తర్వాత దర్శక నిర్మాతలు ఎలాగో మ్యానేజ్ చేసి బాలయ్యని శాంత పరిచడంతో షూటింగ్ సజావుగా జరిగిందని అంటున్నారు. ఇక బాలకృష్ణ తన సింహా సెంటిమెంట్ కొనసాగిస్తూ తాజా చిత్రానికి కూడా వీర సింహారెడ్డి అనే టైటిల్ ఖరారు చేయగా, ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల వీరసింహారెడ్డి చిత్రం నుంచి జై బాలయ్య అనే సాంగ్ విడుదల కాగా, ఇది అంత పెద్ద రెస్పాన్స్ అందుకోలేకపోయింది.