Avatar 2 : అవతార్ -2 విడుదలకు ముందే కేజిఎఫ్ 2, బాహుబలి2 రికార్డులను బద్దలు కొట్టేసింది..!

Avatar 2 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అవతార్ 2.. జేమ్స్ కామెరున్ అద్భుత సృష్టి అవతార్.. సుమారు 13 సంవత్సరాల తరువాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. డిసెంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది.. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వండర్స్ క్రియేట్ చేస్తోంది.. తాజాగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడయ్యాయి..!

Advertisement
Avatar 2 ticket booking on highest than KGF and Bahubali 2 movies
Avatar 2 ticket booking on highest than KGF and Bahubali 2 movies

మొదటి రోజే 2 లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. సుమారు 7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూల్ అయింది. ఇప్పటివరకు ఉన్న కేజిఎఫ్ 2, బాహుబలి 2 ను సవాల్ చేస్తూ ఆల్ టైం బుకింగ్స్ లో ఒకటిగా అవతార్ 2 నిలిచింది.. ఇప్పటివరకు అమ్ముడైన టికెట్స్ లో సుమారు లక్షకు పైగా కేవలం ఐనాక్స్, పివిఆర్, సినీపోలిస్ లలో బుక్ చేసుకోవడం గమనార్హం.

Advertisement

వీకెండ్ లో సుమారు 4.10 లక్షల టికెట్లు అమ్ముడు అయిపోయాయి. ఇది త్వరలోనే 5 లక్షల మార్పులు చేరడానికి సిద్ధంగా ఉంది. దాంతో వీకెండ్ గ్రాస్ 16 కోట్లకు చేరింది. మొత్తం అవతార్ సినిమా ప్రీ సేల్ బుకింగ్స్ 45 కోట్ల నుంచి 80 కోట్లకు రావచ్చని అంచనా వేస్తున్నారు. అవతార్ 2 లో జేమ్స్ కెమెరాన్ సముద్ర గర్భంలోకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Advertisement