Avatar 2 : అవతార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డ్స్ బ్రేక్..

Avatar 2 :  హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో అవతార్ కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం అవతార్ 2.. 13 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.. భారీ అంచనాలు క్రియేట్ చేసిన అవతార్ 2 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి రోజే రికార్డులను క్రియేట్ చేసింది. అవతార్ 2తో జేమ్స్ మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అవతార్ 2 సంచలనాలు సృష్టిస్తుంది. ఇక అవతార్ 2 సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..

Advertisement
avatar-2-first-day-collections-creates-records
avatar-2-first-day-collections-creates-records

అవతార్ 2 మూవీ మొదటి రోజు 3800కు పైగా స్క్రీన్స్‌లో 17000 షోస్ ప్రదర్శించబడింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అయింది. అవతార్ 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ ద్వారా దాదాపు రూ.. 20 కోట్లు కలెక్ట్ చేసింది.

Advertisement

ఇక తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మంచి ఓపినింగ్స్ వసూలు చేసింది.. తొలిరోజు రూ.10 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇండియా వైడ్‌గా అవతార్2 కలెక్షన్స్ 35 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో మరికొన్ని రోజులు అవతార్ కలెక్షన్స్ కు డోకాలేదు అని చెప్పచ్చు. అవతార్ విడుదలైన కలెక్షన్స్ను అవతార్ 2 మొదటి రోజే బ్రేక్ చేసింది.

Advertisement