Singer Sunitha : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింగర్ గా మరింత గుర్తింపు సొంతం చేసుకున్న సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి వివాహం తర్వాత ఎన్నో అవమానాలు, గొడవలు, ఇబ్బందులు , చీత్కారాలు ఎదుర్కొన్న సునీత భర్త నుంచి దూరం అయ్యి.. కొడుకు, కూతురుతో జీవితాన్ని మొదలుపెట్టింది. అయినప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈమె వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నత స్థానానికి చేరుకుంది.. అయితే గత ఏడాది తనకు ఇష్టమైన.. స్నేహితుడైన మ్యాంగో వీడియో అధినేత రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆమె జీవితం రంగుల మయం అయిందని చెప్పవచ్చు.

అడపాదడపా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సునీత వివాహం తర్వాత ఎక్కువగా తన సమయాన్ని సోషల్ మీడియాకే కేటాయిస్తూ తనకు సంబంధించిన అలాగే తన కుటుంబానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ మరింత పాపులారిటీని దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ మరొక పక్క తాను సందర్శిస్తున్న ఆలయాల ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తోంది. మొన్నా మధ్య కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కాకతీయులు నిర్మించిన పురాతన కట్టడం రామప్ప దేవాలయాల్ని సందర్శించుకొని భక్తిపారవశ్యంలో మునిగితేలిన సునీత ఇప్పుడు విశాఖపట్నం సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
ఇటీవల ఆమె స్వామి వారిని దర్శించుకొని ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతే కాదు ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సునీతకు ఏ ఈ ఓ రాజు ప్రసాదాన్ని అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి. భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న సునీతను చూడడానికి అక్కడి భక్తులు పోటెత్తారు. అలాగే అభిమానులు క్యూ కట్టారు. అంతలా ఎక్కడికి వెళ్ళినా తన అభిమానులకు మరింత దగ్గరవుతూ భారీ పాపులారిటీని దక్కించుకుంటోంది.