veena srivani వేణు స్వామి భార్య వీణా శ్రీ వాణి తన భార్య గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియా తో పంచుకున్నారు. వేణు స్వామి తనది లవ్ మ్యారేజ్ అని తన భార్య చెప్పారు. మీరేమో ఇంత స్లిమ్ గా ఉన్నారు మీ వారేమో కాస్త బొద్దుగా ఉన్నారు అని అడుగగా.. మా వారు తిరుపతి లడ్డు అని పకపక నవ్వేస్తుంది యాంకర్ వేసిన ప్రశ్నలకు.. ఎలా పరిచయమైంది మీ ఇద్దరికీ అని అడగగా..
నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే ఆర్ఆర్ బీ స్టేట్ సెకండ్ ర్యాంక్ ను.. ఆ జాబ్ కి కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడే నా మీద నేను డిపెండ్ అవ్వాలని వీణ క్లాసెస్ తీసుకుంటున్నాను. వేణు స్వామి వాళ్ళ కజిన్ కూతురు నా దగ్గర ఆ వీణ క్లాసెస్ ని నేర్చుకోవడానికి వచ్చింది. ఒకరోజు ఆ పాపను తీసుకోవాలని వేణు స్వామి వచ్చారు. మొదటి చూపులోనే నన్ను ఇష్టపడ్డారు. చేసుకుంటే నన్నే చేసుకోవాలని అనుకున్నారు. నేను కూడా ఆయన లవ్ ప్రపోజ్ చేయగానే ఒప్పుకున్నాను.
ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అని అడగగా.. మొదటగా వేణు స్వామినే ప్రపోజ్ చేశారని తన భార్య చెప్పారు. వాస్తవంగా నేను అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఈరోజు అందం ఉంటుంది. రేపు పోతుంది. ఈరోజు మా ఆయన తిరుపతి లడ్డు లాగా ఉండవచ్చు. రేపు నేను తిరుపతి లడ్డు లాగా అవ్వచ్చు. నేను మా ఆయన్ని ముద్దుగా తిరుపతి లడ్డు అని పిలుస్తాను అని శ్రీవాణి నవ్వుతూ చెప్పింది.
ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. ఒక అబ్బాయి ఇలా ఉంటాడని నేను చూడలేదు. ఒక భార్య ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడమే కాకుండా తనకి నచ్చినట్టుగా అన్ని ముందే చేసి పెడతారు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్లాలి అని అనుకుంటే.. దారిలో ఎదురయ్యే పరిస్థితులన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు నన్ను వెళ్ళమని చెబుతారు. అది ఆయన ఆటిట్యూడ్ అని శ్రీవాణి గర్వంగా తన భర్త వేణు స్వామి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
అంతేకాకుండా వేణు స్వామి కోసం తన కుటుంబాన్ని కూడా వదిలేసుకున్నానని శ్రీవాణి చెప్పారు. అయినా కానీ తన అత్తమామలతో పాటు చిన్న అత్తయ్య వాళ్ళు కూడా తనని ఎంతో ప్రేమగా చూసుకుంటారని.. ఇక పిల్లల కెరీర్ విషయంలో ఆ విషయాలన్నీ పడి మర్చిపోయాను అని చెప్పారు. అలాగే వీణ వాయించడం నాకు ఇష్టమని.. అందుకే నేటితరం వారికి సినిమా పాటల టచ్ ను కూడా అందిస్తూ వీణ వాయిస్తున్నానని శ్రీవాణి తెలిపారు. సోషల్ మీడియా ద్వారా నేను మరింత పాపులర్ అయ్యారని శ్రీవాణి సంతోషంగా తన విషయాలను పంచుకున్నారు.