Ashu Reddy : హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన అషూ రెడ్డి.. సినిమా ఏదంటే..?

Ashu Reddy :  ప్రముఖ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న అషూ రెడ్డి బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత మరింత పాపులారిటీని దక్కించుకుంది . ఆ తర్వాత రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ మరింత పాపులారిటీ తీసుకొచ్చిందని చెప్పాలి. అంతేకాదు ఇటీవల రాంగోపాల్ వర్మ ఈమె కాలివేలును నోట్లో పెట్టుకుని చీకినంత పని చేయడంతో ఈమె పేరు ఎక్కడ చూసినా బాగా మారుమ్రో పోయింది. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఎన్నో రియాల్టీ షోలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో కూడా అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ కి మించి బోల్డ్ గా వరుస ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

Advertisement
Ashu Reddy get a heroine chance in that movie..!
Ashu Reddy get a heroine chance in that movie..!

ఇంత పాపులారిటీ దక్కించుకున్న ఈమెకు తాజాగా హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో అరవింద్ కృష్ణ తాజాగా ఒక చిత్రాన్ని మొదలుపెట్టారు. ఏ మాస్టర్ పీస్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సిల్వర్ స్క్రీన్ పై మునుపేన్నడు లేని విధంగా తెలుగు సూపర్ హీరోగా అరవింద్ కృష్ణ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అషూ రెడ్డి హీరోయిన్గా సెలెక్ట్ అయిందని సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు సంబరపడిపోతున్నారు.

Advertisement
Advertisement