Arohi Rao – RJ Surya : బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంట .. బయట ఆ అమ్మాయి పేరెంట్స్ కి మండిపోతోంది !

Arohi Rao – RJ Surya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 6 కార్య‌క్ర‌మం రోజురోజుకి ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ఇప్పుడిప్పుడే ఎమోష‌న్స్, కొట్లాట‌లు, బాండింగ్, ల‌వ్ వంటివి కంటెస్టెంట్స్ మ‌ధ్య పుట్టుకొస్తున్నాయి. ప్ర‌తి సీజ‌న్‌లో ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డ‌వ‌డం కామ‌న్‌గా మారిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే ఈ సీజన్ లో ఆర్జే సూర్య, ఆరోహి రావు జంట ప్రేమ‌లో మునిగి తేలుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆర్జే సూర్య తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఆరోహి రావు కూడా ఇప్పుడిప్పుడే ఆట మీద తన దృష్టి పెడుతూ..

ప్రేక్షకులకు దగ్గర అవుతోంది.కొద్ది రోజులుగా వీరిద్ద‌రు ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవ‌డం, సూర్య ఏదైన త‌ప్పు చేస్తే ఆరోహి చెప్ప‌డం అలానే ఆరోహి విష‌యంలో త‌ప్పులు దొర్లితే సూర్య స‌రి చేయ‌డం జ‌రుగుతూ వ‌స్తుంది.అయితే ఇద్ద‌రి మ‌ధ్య న‌డుస్తున్న‌ది ఇది స్నేహామా, లేక ప్రేమా అనే విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆదివారం ఎపిసోడ్‌లో ఆరోహిరావు-ఆర్జే సూర్య ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అది. నేను కూడా గమనించాను. ఆరోహిరావు-ఆర్జే సూర్య ప్రేమించుకుంటున్నారని అభినయశ్రీ స్ట్రాంగ్ చెప్పారు. అయితే ఆరోహిరావు ఈ ఆరోపణలు ఖండించారు.మూడేళ్ల ప‌రిచ‌యంలో క‌ల‌గ‌ని ప్రేమ రెండు వారాల‌లో ఎలా క‌లుగుతుంది.

arohi rao rj surya love track now topic
arohi rao rj surya love track now topic

Arohi Rao – RJ Surya : ప్రేమ‌లో ప‌డ్డారా..

అలాంటిదేమి లేదంటూ ఆరోహి చెప్పుకొచ్చింది. రెండో వారంలోనే ఈ ప్రేమ జంటను ఫిక్స్ చేయడం కొంచెం కష్టం కాని రానూరానూ వీరి మధ్య సంబంధం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాగా, గ‌త సీజ‌న్స్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్ సార్థక్-మోనాల్, అభిజీత్-అలేఖ్య హారిక , షణ్ముఖ్ జస్వంత్-సిరి బిగ్ బాస్ ప్రేమ ప‌క్షులుగా ఫుల్ పాపులారిటీ సంపాదించారు. ఇక ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ లో 21 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా… వీరిలో కొన్ని ముఖాలు అందరికీ తెలిసినవి కాగా.. మరికొన్ని మొహాలు కొత్తవి. అయితే మొదటి వారం గొడవలు, ఏడుపులు, సరదాలతో గడిచిపోగా… రెండో వారం మాత్రం మ‌రింత ర‌చ్చ‌గా మారింది. చూస్తుంటే ఈ షో రానున్న రోజుల‌లో మ‌రింత వినోదాన్ని పంచ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Advertisement