Breaking:బాలయ్య 108వ సినిమా కోసం రంగంలోకి దిగిన ‘అర్జున్ రాంపాల్!’

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమా అప్డేట్స్ కోసం ఆనందమూరి అభిమానులతోపాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కావడంతో ఈ సినిమాపైన అంచనాలు భారీగానే వున్నాయి. F2 సిరీస్ సినిమాల తరువాత అనిల్ రావిపూడి నుండి వస్తున్న బాలయ్య కాంబినేషన్ సినిమా కావడంతో అందరూ ఈ సినిమా కోసం జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సాలిడ్ ఎంటర్టైనర్ లో బాలయ్య డ్యూయల్ షేడ్స్ లో కనిపించనుండగా టాక్ వినబడుతోంది.

అయితే, ఈ సినిమా ప్రకటించిన మొదిటినుండి అందరికీ విలన్ విషయంలో చాలామంది ఓ సందేహం వుంది. ఈ విషయంలో తాజాగా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో కీలక పాత్రకి గాను బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ని సాదరంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఈ చిత్రం మేకర్స్ ఇపుడు అధికారికంగా అనౌన్సమెంట్ చేసారు. కాగా ఈ సినిమాతోనే ఈ నటుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనిపై ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ చేయడం గమనార్హం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.