Archana : తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగు అమ్మాయి అర్చన వేద శాస్త్రి.. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సత్తిబాబు దర్శకత్వం వహించిన నేను సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమైంది.. ఆ తరువాత శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాలలో నటించింది.. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తాజాగా అర్చన వేద శాస్త్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టాప్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేశారు..
తాజాగా అర్చనా మాట్లాడితే ఇండస్ట్రీలో అమ్మాయిల్ని ట్రాప్ చేయాలని కొంతమంది హీరోలు ఉంటారని.. మైండ్ ని క్యాప్చర్ చేయడానికి చూస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఎవరైనా అమ్మాయి కాస్త వీక్ గా ఉంటే ఆ అమ్మాయి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి కొంతమంది జనాలు ప్రయత్నిస్తూ ఉంటారని.. అందుకే అమ్మాయిలు వీక్ కాకూడదు.
ఏడిస్తే వీక్ అనడం కరెక్ట్ కాదు. ఏడుపుకి వీక్ కి సంబంధం లేదని అన్నారు అర్చనా. తనను కూడా వీక్ అనుకుని ఒక హీరో ట్రాప్ చేయాలని చూశాడని.. అతను మనకి బాగా తెలిసిన వ్యక్తి.. మరీ ఎక్కువ సక్సెస్ కలిగిన హీరో కాదు. ఆయన నాకు తెలియకుండా నా వెనకాల నించమైన మాటలు కూడా మాట్లాడారట. ఆ మాటలు నాకు వేరే వాళ్ళు చెబితే చాలా బాధపడ్డాను.. అందంగా ఉండి బ్యాగ్రౌండ్ పెద్దగా లేని అమ్మాయిలను వారి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు ఉన్నారని కామెంట్స్ చేశారు.
మనకి మంచి అనేది ముందే తెలుస్తుంది. మనకి సెట్ కాని పరిస్థితుల్లో కొందరు వీక్ అవుతారు. అలాంటి వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి. అలాంటివి ఏ అమ్మాయికైనా అబ్బాయి కైనా జరగకూడదని అర్చన అన్నారు. తనకి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని.. దాంతో తన ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగానని అర్చన తెలిపారు.