NTR : ” భార్య కన్నా ముందే మీకు చెబుతాను ” అని ఎన్టీఆర్ అన్న దాని మీద ప్రణతి సీరియస్ రియాక్షన్ !

NTR :నందమూరి కళ్యాణ్ రామ్ ఆషిక రంగనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం అమిగోస్.. ఈనెల 10వ తేదీన ఈ సినిమా ధియేటర్స్ లో విడుదల కానుంది.. నిన్న రాత్రి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.. అందులో భాగంగా ఎన్టీఆర్ 30వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..

ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాపై ఓపెన్ అయ్యారు. అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి.. కొరటాల శివతో చేయబోయే పాన్ ఇండియా సినిమా గురించి ఫాన్స్ పదేపదే అడగడంతో ..ఈ ఫిబ్రవరిలోనే పూజ చేసి మార్చి 20 లేదా ఆలోపే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళిపోతామని చెప్పారు.

మీ ఆరాటాన్ని అర్థం చేసుకోగలనని.. అలా అని కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నా.. నిర్మాతల మీద పనిచేసే దర్శకులు మీద ఒత్తిడి పెట్టడం భావ్యం కాదని హితబోధ చేశాడు. అంతేకాదు ఏదైనా శుభవార్త ఉంటే భార్య కంటే ముందు మీతో పంచుకుంటానని చెప్పి మరో స్వీట్ న్యూస్ చెప్పాడు.. దాంతో అక్కడికి విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చప్పట్లతో హోరెత్తించారు.. కొంత నలతగా తలనొప్పిగా ఉన్న సరే ఓపిక చేసుకుని మీకోసమే వచ్చానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో అభిమానులు ఖుషి అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్ళిపోతుంది .

తారక్ ఫ్యాన్స్ తో ఏదైనా శుభవార్త ఉంటే నా భార్య కంటే ముందు మీకే చెప్తా అనే విషయంపై నా భార్య ప్రణిత రియాక్ట్ అయ్యారట.. నువ్వు నాకంటే కూడా ఫాన్స్ కి విలువ ఇవ్వడమే నాకు చాలా ఇష్టం.. ఎందుకంటే నాకంటే వాళ్లకే నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారట ప్రణీత.. కాకపోతే వాళ్ళ తరువాత ఏ విషయమైనా సరే నాతోనే చెప్పాలి.. లేకపోతే మాత్రం సీరియస్ రియాక్షన్ ఉంటుందంటూ జోవియల్ గా రియాక్ట్ అయ్యారట ప్రణతి ..ఈ విషయాలు వారి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.. తారక్ ప్రణతి ఎంత అన్యోన్యంగా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే