Anushka : అనుష్క తో పెళ్లి విషయం లో ప్రభాస్ ఫ్యాన్స్ కి లేటెస్ట్ గుడ్ న్యూస్ !!

Anushka : వెండితెర‌పై కొన్ని క్రేజీ జంట‌ల‌ని చూస్తే చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. వారు రియ‌ల్ లైఫ్‌లోను క‌పుల్‌గా మారితే బాగుంటుంద‌ని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి జంట‌ల‌లో అనుష్క ప్ర‌భాస్ జంట ఒక‌టి. వీరిద్ద‌రు వెండితెర‌పై మ్యాజిక్ చేశారు. ప్రభాస్ అనుష్క పలు సినిమాలలో కలిసి నటించగా ఆ సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాయి. అయితే ప్రభాస్ – అనుష్క మధ్య ఏదో ఉంద‌నే వార్తలు కొన్నాళ్లుగా జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. మధ్య మ‌ధ్య‌లో వీరి పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. మ‌ధ్యలో సైలెంట్ అయిన వీరి యవ్వారం.. సీనియర్ హీరో.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణంతో మరోసారి బయటకు వచ్చింది.

anushka-prabhas-fans-gets-good-news
anushka-prabhas-fans-gets-good-news

ఇందులో నిజ‌మెంత‌?

కృష్ణంరాజు హస్పిటల్ లో ఉన్న సమయంలో ప్రభాస్ తో పాటు అనుష్క కూడా ఒకే సారి అక్కడికి వెళ్లి ప‌రామ‌ర్శించ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే ప్ర‌చారం న‌డిచింది. ఇక ఈ య‌వ్వారం మ‌ధ్య‌లో కొంత సైలెంట్ కాగా, ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్ అయింది. ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉండ‌గా, వీరిద్ద‌రు క‌లిసి పెళ్లి గురించి మాట్లాడాల‌ని అన‌కుంటున్నార‌ట‌. ప్ర‌భాస్, అనుష్క త‌మ కెరీర్స్‌తో చాలా బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఇటీవ‌ల వీరు క‌లిసింది లేదు. దీంతో ఒక‌సారి క‌లిసి పెళ్లి గురించి ముచ్చ‌టించుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లి విష‌యం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ గతంలో ఎన్నో రకాల పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.. సీక్రేట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకున్నారని, పెళ్ళి తరువాత ఉండటానికి అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో లెక్క‌లేనన్ని వ‌చ్చాయి. ఇప్పుడు ఇద్ద‌రు పెళ్లి గురించి మాట్లాడుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.