Anupama Parameswaran : కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైంది.. అనుపమ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా కూడా నటించింది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.. అనుపమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు కుర్ర కారు ఫిదా అవుతారు.. తాజాగా అనుపమ పెట్టిన పోస్ట్ కు ఓ నెటిజన్ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యాడు ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.. తెలుగు లో నితిన్ నటించిన అఆ సినిమాతో నాగవల్లి పాత్రలో నటించింది. ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా కూడా పేరు తెచ్చుకుంది..
ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూ నే ఉంటుంది. తరుచూ ఏదో ఒక ఫన్నీ వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది..
నిత్యం ఏదో ఒక ఫోటోను ఆమె పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఫన్నీ వీడియోలను ఆమె బాగా పోస్ట్ చేసుకుంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది అనుపమ. ఆ ఫోటో అనుపమ తను చాలా న్యాచురల్ గా అందంగా కనిపించింది. తన చూపులతో అందర్నీ కూడా మరోసారి మాయ చేసింది. కాగా ఆ ఫోటోని చూసిన తన అభిమానులు బాగా లైక్స్ కొట్టగా ఓ నెటిజన్ ఓ కామెంట్ కూడా పెట్టారు..
ఇంతకు అదేంటంటే.. ఈమధ్య హాట్ ని స్టీల్ చేసే వాళ్ళు ఎక్కువై పోయారు . కేసు పెట్టాలి అంటూ.. అనుపమ అందాలను తట్టుకోలేక కొంటెగా కామెంట్ ను చేశారు.. దాంతో ఆ కామెంట్ చూసి కొందరు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో బాగా దూసుకుపోతుంది. ఇప్పటికే కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకోగా ప్రస్తుతం మరిన్ని సినిమాలలో బిజీగా ఉంది. ఇక ఆ మధ్య డీజే టిల్లు 2 లో ఛాన్స్ కొట్టేసింది అని సమాచారం.