Anupama Parameswarn : యంగ్ హీరో నితిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్.. డిసెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ అనుపమ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవ్వగా.. అనుపమ వాటిపై స్పందించింది..

రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా సమంత కంటే ముందు నన్ను సుకుమార్ గారు అడిగారు. కానీ అప్పుడు నేను ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాను. ఆ అవకాశం మిస్ అయ్యాక నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు సుకుమార్ సార్ దర్శకత్వంలో సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమాలో మంచి పాత్రను ఎంచుకోవడం అనేది మన చేతుల్లో ఉండదు. కథను పాత్రను బట్టి అవే మనల్ని ఎంచుకుంటాయి అని అనుపమ చెప్పింది. రంగస్థలం సినిమాలో మిస్సయిన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది అని అనుపమ మీడియాతో ముచ్చటించింది.