Anchor Suma : సుమ అక్కా .. నువ్ అంటే మాకు ఇష్టం .. కానీ ఇలా చేస్తే చిరాకు వస్తోంది !

Anchor Suma : బుల్లితెర సూప‌ర్ స్టార్ సుమ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. యాంకర్ గా గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమకు హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పాలి.ఈ విధంగా యాంకర్ గా సక్సెస్ అయిన ఈమె వెండితెరపై కూడా తళుక్కుమన్నారు. కుర్ర యాంక‌ర్స్‌కి సైతం పోటీ ఇస్తూ ముందుకు సాగుతున్న సుమ టాలెంట్ గురించి ఎంత పొగిడిన త‌క్కువే. ఆమె సెన్సాఫ్ హ్యూమ‌ర్ అయితే పీక్స్‌లో ఉంటుంది. సుమ ఏదైనా ఒక కార్యక్రమానికి యాంకర్ గా చేస్తోంది అంటే అది సంవత్సరాల తరబడి కొనసాగుతూనే వస్తుందని ఆనవాయితీ కూడా ఉంది.

అయితే సినిమా ఈవెంట్స్‌ని సైతం హోస్ట్ చేస్తున్న సుమ రీసెంట్‌గా నాగశౌర్య హీరోగా నటించిన “కృష్ణ వింద విహారి” చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకరింగ్ చేసింది. ఈ ఈవెంట్‌లో సుమ కనకాల తనదైన స్టైల్ లో హోస్ట్ చేస్తూ ఫుల్ కామెడీని పండించింది. అయితే ఈ క్రమంలోనే బ్రహ్మాజీకి ఆమెకు మ‌ధ్య జ‌రిగిన డిస్క‌ష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్ద‌రు ఒకే స‌మ‌యంలో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు కాబ‌ట్టి ఇద్ద‌రి మ‌ధ్య కాస్త చ‌నువు ఉంటుంది. అందుకే ఒక‌రిపై ఒక‌రు సెటైర్స్ వేసుకుంటారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకరింగ్ చేస్తూ స్టేజ్ దిగి సుమ కనకాల బ్రహ్మాజీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది.

Anchor Suma gets trolled by netigens
Anchor Suma gets trolled by netigens

Anchor Suma : ఇలా చేసిందేంటి?

ఇప్పుడు మాట్లాడుకుందామా అంటూ బ్రహ్మాజీతో సరదాగా మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది. దీనికి బ్రహ్మాజీ కూడా స్మైల్ ఇస్తాడు.సుమ‌ మాట్లాడుతూ ..”మీ ఏజ్ ఎంత” అంటూ యాంకర్ సుమ బ్రహ్మాజీని ప్రశ్నిస్తుంది. దీంతో బ్రహ్మాజీ నవ్వుతూ..” యు నాటీ.. ఆంటీ” అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు . ఈ దెబ్బకు సుమ ముఖం వాడిపోయింది. ఇంకా ఎక్కువ‌గా అడిగితే త‌న‌కే పంచ్ ప‌డుతుంద‌నుకుందో ఏమో కాని సుమ వెళ్లిపోయింది. అయితే బ్ర‌హ్మాజీ అన‌సూయ‌ని ఉద్దేశించే మాట్లాడ‌ని చ‌ర్చ న‌డుస్తుండ‌గా, కొంద‌రు సుమ‌ని ట్రోల్ చేస్తున్నారు. మెల్ల‌గా చిచ్చు పెట్టి వెళ్లింద‌ని ఆమెను విమ‌ర్శిస్తున్నారు.