Anchor sree Mukhi : స్టార్ యాంకర్ శ్రీముఖి బుల్లితెర రాములమ్మగా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు టీవీ షోలలో, డిజిటల్ షోస్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. వీటన్నింటికి తోడు సోషల్ మీడియాలోనూ ఎలా యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా శ్రీముఖి కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
శ్రీముఖిని ఎక్కువమంది అడిగే ప్రశ్న ఏంటంటే ఆమె పెళ్లి ఎప్పుడు అని.. ఈమధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి పెళ్లికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. దానికి తోడు శ్రీముఖి ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇటీవల శ్రీముఖి ఆమెకు కాబోయే వాడికి సంబంధించిన ఫ్యామిలీలు కలుసుకొని మాట్లాడుకున్నారని. ఇక ప్రకటన మాత్రమే రావాల్సి ఉందని సమాచారం.
కాగా శ్రీముఖి పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేసింది. శ్రీముఖి హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకోబోతుందని పెళ్లి చేసుకున్నాక ఒకేసారి తన భర్తని పరిచయం చేస్తుందని మరికొంతమంది అంటున్నారు. మొత్తానికి శ్రీముఖి పెళ్లికి సంబంధించిన హల్దీ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ అమ్మడు మనందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటుందా.. లేదంటే పెళ్లి చేసుకొని ఏకంగా తన భర్తనే చూపిస్తుందా అనేది వేచి చూడాలి.