Anasuya : కోడలైనా అలా పిలవాల్సిందే.. మరొకసారి ట్రోలర్స్ చేతికి చిక్కిన అనసూయ..!

Anasuya :  న్యూస్ రీడర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన అనసూయ జబర్దస్త్ ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అలా నిర్విరామంగా 9 సంవత్సరాల పాటు యాంకర్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ తన మాటలతోనే కాదు అందాలతో కూడా యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది .

ముఖ్యంగా తన ఎద అందాలను చూపిస్తూ నడుము అందాలతో పిచ్చెక్కించే అనసూయ అందానికి ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే ఫిదా అవ్వాల్సిందే.. ముఖ్యంగా నటనలో ఈమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.. రంగస్థలంలో రంగమ్మత్తగా.. పుష్ప సినిమాలో దాక్షాయిణిగా.. తన నటనతో ఉగ్ర స్వరూపం చూపించింది.. ఇక అనసూయ అందంలోనే కాదు నటనలో కూడా అంతకుమించి అన్నట్టుగా నటిస్తూ ఉంటుంది.. కానీ అప్పుడప్పుడు ట్రోలర్స్ చేతికి చిక్కుతూ దారుణంగా బలవుతూ ఉంటుందని చెప్పవచ్చు.

Anasuya is caught in the hands of trollers
Anasuya is caught in the hands of trollers

Anasuya : ఇక సోషల్ మీడియా ద్వారా

ఇక సోషల్ మీడియా ద్వారా తనను ఎవరైనా సరే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంలో ముందుండే అనసూయ ఆంటీ అనే పదంతో గత నెల రోజుల నుంచి విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఇకపోతే ఇటీవల తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా ఆకట్టుకుంది. నిన్నటి వరకు అంతా బాగుందనుకునే సరికి ఈరోజు ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఆమెను మళ్లీ ట్రోలర్స్ చేతికి చిక్కేలా చేసింది. ఇదిలా ఉండగా తాజాగా అనసూయ, యాంకర్ సుమ నిర్వహించే క్రేజీ కిచెన్ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నది. ఇక ఈ సందర్భంగా అనసూయ పలు ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించడం జరిగింది.

“అందరూ కూడా నాకు వంటలు రావని అనుకుంటారు.. కానీ నేను చాలా బాగా వంట చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక తాను ఎంత బాగా వండుతానో ఈ షో ద్వారా అందరికీ తెలుస్తుందని కూడా చెప్పింది. మాటల సందర్భంలో ఆంటీ అనే పదం మళ్లీ ప్రస్తావనకి వచ్చింది.. సుమ మాట్లాడుతూ.. బీహార్లో అయినా తెలుగులో అయినా అత్తని అత్త అనే పిలుస్తారా..ఇంకా ఏదైనా పిలుస్తారా అని అడగగా.. అప్పుడు అనసూయ స్పందిస్తూ నిజంగా చెప్పాలి అంటే అత్త , పిత్త అని పిలవడం నాకు అసలు ఇష్టం ఉండదు. చివరికి నా కోడలైనా సరే నన్ను అత్త అని పిలిస్తే ఇష్టం ఉండదు.. కేవలం అనసూయ, అను అని పిలిస్తే చాలు”.. అంటూ చెప్పుకొచ్చింది . దీంతో మరొకసారి ఆంటీ వివాదం తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈమెను అందరూ కూడా కోడలు చేత కూడా అను అని పిలిపించుకుంటావా అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.