Anasuya అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈమె తర్వాత పలు టీవీ షోలు, సినిమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే హాట్ ఫోజులతో యువతకు గిలిగింతలు పెడుతోంది పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈమె.. 30 సంవత్సరాల వయసు దాటినా ఇంకో పదహారణాల పడుచు పిల్లలు గ్లామర్ వలకబోస్తూ ఉండడంతో అందరూ ఈమె అందాలకు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈమె సమయం దొరికితే చాలు నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో ట్రోల్స్ బారిన కూడా పడింది. తాజాగా అదే కోణంలో ఒక పోస్ట్ పెట్టడం అది కాస్త వైరల్ గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే అతిపెద్ద మ్యాటర్లో అడ్డంగా దొరికిపోయిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇటీవల పఠాన్ చిత్ర ప్రెస్మీట్లో చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఒక పోస్ట్ చేసింది..షారుక్ మాట్లాడుతూ.. డర్ , బాజీగర్ చిత్రాలలో నేను నెగిటివ్ రోల్స్ చేశాను. జాన్ అబ్రహం కూడా నెగిటివ్ రోల్స్ చేశాడు. కాబట్టి మేమంతా చెడ్డవాళ్ళం అని కాదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆ పాత్రలు పోషిస్తామన్నారు.. అయితే ఈ కామెంట్స్ ని ఆమె పోస్ట్ చేసింది.
అనసూయ ఈ మాటలను పోస్ట్ చేస్తూ..” మేము మొదటి నుంచి చెప్తున్నాం.. నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తాం.. కానీ నిజజీవితంలో మా క్యారెక్టర్ అలా ఉండదు. సినిమాలను బట్టి మా క్యారెక్టర్స్ ని రియల్ లైఫ్ లో కూడా ఊహించుకోవద్దు” అంటూ షాకింగ్ కామెంట్లు చేస్తూ పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది.