Ananth Sriram : అతి పెద్ద వివాదంలో అనంత్ శ్రీరామ్ జైల్ గ్యారెంటీ ?

Ananth Sriram :సినీ గేయ రచయిత అనంత్ శ్రీ రామ్ గురించి పరిచయం అక్కర్లేదు.. ఇప్పటికే ఎన్నో పాటలను రాశారు.. మంచి రచయితగా గుర్తింపు చేచ్చుకున్నరు..  గేయరచయితగా మంచి గుర్తింపు పొందిన వారిలో అనంత్ శ్రీరామ్ ఒకరు. ఆయన చూడటానికి ఎంత సౌమ్యంగా కనిపిస్తాడో, ఆయన రాసే పాటలు కూడా అంతే సౌమ్యంగా ఉంటాయి. అయితే ఎల్లప్పుడూ సాఫ్టుగా కనిపిస్తూ, చక్కగా మాటలతో మెప్పించే అనంత్ శ్రీరామ్ ఇటీవల ఎవరు ఊహించని విధంగా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అనంత్ శ్రీ రామ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు.

Ananth sree ram words on bhatraju people file a case
Ananth sree ram words on bhatraju people file a case

పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న అనంత శ్రీ రామ్.. ఆ సభలో భట్రాజు పొగడ్తలు అంటూ తమ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని భట్రాజు కులస్తులు ఫిర్యాదు చేశారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఏపీ ప్రభుత్వం నిషేదించిందని.. అయినా కూడా ఇంకా  తమ కులం పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.అనంత్ శ్రీరామ్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. గతంలోనూ ఒక పాట విషయంలో దేవతలను విమర్శించేలా రాశారని ఆయన పై అభ్యంతరం వ్యక్తం చేశారు కొందరు.

తాజాగా భట్రాజు కులస్థులు అనంతశ్రీరాం స్టేజ్ పై చేసిన వ్యాఖ్యల వీడియోలని జత చేసి ఫిర్యాదు చేశారు. అయితే భట్రాజు కులస్థులు అనంత్ శ్రీరామ్ ను అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. దాంతో అనంత్ శ్రీరామ్ జైలు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ అనంత్ శ్రీరామ్ క్షమాపణలు చెబితే ఈ సమస్య సద్దుమనిగే అవకాశం కూడా ఉంది. చూడాలి అనంత్ శ్రీరామ్ ఏ విదంగా రియక్ట్ అవుతారో.