Mahesh Babu -Amitabh Bachchan : మహేష్ తండ్రి గా బిగ్ బీ.. అంచనాలు పెంచేస్తున్న రాజమౌళి..!

Mahesh Babu -Amitabh Bachchan : తాజాగా మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వచ్చే యేడాది జనవరి నుంచి ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే కొన్ని అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని.. ఇప్పటికే రాజమౌళి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Amithab bacchan as Mahesh's father.. Rajamouli is raising expectations..!
Amithab bacchan as Mahesh’s father.. Rajamouli is raising expectations..!

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వి ఎఫ్ ఎక్స్ వర్క్ , లొకేషన్స్, సెట్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కబోతున్నట్లు ఇప్పటికే ఒక్కొక్కరిని రివీల్ చేస్తున్నారు రాజమౌళి .. ఈ క్రమంలోనే ఒక క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ మహేష్ బాబుకి తండ్రి పాత్రలో చేస్తున్నారట. ఈ మేరకు అమితాబ్ తో చర్చలు జరుపగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ.. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. మరి ఇందులో రాజమౌళి ప్లాన్ చేసినట్టుగా మహేష్ బాబుకు అమితాబ్ బచ్చన్ తండ్రిగా నటిస్తారో లేదో అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.