Allu Aravind : అల్లు ఫ్యామిలీలో ఇంత విషాదమా.. ఇప్పటికే ఆ విషయంలో బాధపడుతున్న అల్లు అరవింద్..!

Allu Aravind : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా అల్లు అరవింద్ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈయనతో పాటు అల్లు శిరీష్ , అల్లు బాబీ కూడా ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులేనని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి అల్లు అరవింద్ కి నలుగురు సంతానం. ఒక కుమారుడు యాక్సిడెంట్లో మరణించాడు.

Advertisement
Allu Arvind is still suffering in that matter..!
Allu Arvind is still suffering in that matter..!

అయితే ఈ విషయాన్ని అల్లు శిరీష్ తెలిపారు.. ఈయన నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి పాల్గొన్న అల్లు శిరీష్ సినిమా గురించి తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే హోస్ట్ అలీ ఒక ఎమోషనల్ ప్రశ్న అడిగారు. అల్లు అరవింద్ గారిని ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను.. కానీ ఆయన ఎమోషనల్ అవుతారని అడగలేదు.. అందుకే నిన్ను అడుగుతున్నాను.. మీ నాన్నగారికి ఎంతమంది సంతానం అని అడిగగా.. ” మా పేరెంట్స్ కి మేము నలుగురు సంతానం.. పెద్దన్నయ్య వెంకటేష్ , రెండో అన్నయ్య రాజేష్, మూడో అన్నయ్య అర్జున్ , నేను.. అయితే రాజేష్ అన్నయ్య నేను పుట్టకముందే ఆక్సిడెంట్ లో చనిపోయారు” అని శిరీష్ చెప్పారు.

Advertisement

ఈ విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యారు అల్లు శిరీష్ . అయితే ఈ విషయం తెలుసుకున్న అల్లు అభిమానులు అయ్యో అంటూ నిట్టూరుస్తున్నారు. అంతేకాదు అల్లు అరవింద్ కూడా తనకు రెండవ కొడుకు మరణించడం ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తను తదుపరి సినిమాల విషయంపై దృష్టి పెట్టారు. మరి అల్లు అర్జున్ తన పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోగా అల్లు బాబీ మాత్రం నిర్మాణ రంగంలో మరింత బిజీగా అయిపోయారు. అల్లు రాజేష్ కూడా ఉండి ఉంటే అల్లు వారి ఇమేజ్ మరింత పెరిగిపోయి ఉండేది అని అల్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement