అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.. ఇక పుష్ప సీక్వెల్ గా పుష్ప2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవి పేరు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఆ స్థానంలో మరో యంగ్ హీరోయిన్ పేరు పిలుస్తుంది.

సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 కథ చాలా స్ట్రాంగ్ గా ఉండేందుకు స్క్రిప్టులో రెండవ హీరోయిన్ గా ఈమె పాత్రను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇందులో సాయి పల్లవి నటిస్తుందా లేదా అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ సెకండ్ హీరోయిన్ ప్లేస్ లో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. అందులో ఒక ముఖ్యమైన పాత్రలో ఈమె నటిస్తున్నట్టు సమాచారం.
ఐశ్వర్య ఒక గిరిజన యువతి పాత్ర లో అదికూడా కీలకమైన పాత్ర అన్నట్టు తెలుస్తుంది. ఈ రోల్ కోసం ముందు సాయి పల్లవి పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ పేరు వినిపిస్తోంది. అయితే వీరిద్దరిలో ఈ పాత్ర ఎవరికైనా సరే ఖచ్చితంగా సూట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే సాయి పల్లవి తనకు ఎలాంటి పాత్ర నచ్చినా అది చిన్నదా పెద్దదా తేడా లేకుండా నటిస్తుంది. అయితే ఇందులో అసలు సెకండ్ హీరోయిన్ పాత్ర ఉందా లేదా అనే విషయం పైన పుష్ప టీమ్ క్లారిటీ ఇస్తే ఈ వార్తల పై స్పష్టత వస్తుంది.