Allu arha : సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. ఈచిత్రంలో మరో కీలక పాత్ర కోసం అల్లు అర్హ , సితార పరిశీలనలో ఉన్నాయని .. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే..
అయితే తాజాగా ఈ పాత్రకు త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఫైనల్ చేశారట. ముందుగా ఈ పాత్రకి మహేష్ బాబు కూతురు సితార ఆ క్యారెక్టర్ కు తీసుకోవాలని అనుకున్నారట. కానీ అల్లు అర్హ ను త్రివిక్రమ్ ఫైనల్ చేశారట.. అందుకు కారణం అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ కి మధ్య ఉన్న అనుబంధమే అని తెలుస్తోంది.. అల్లు అర్జున్ మహేష్ సినిమాలో అల్లు అర్హకు చాన్స్ ఇవ్వరులే అని లైట్ తీసుకున్నాడట.
కాకపోతే మహేష్ కూడా అల్లు అర్హకు తన సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారట. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ బిత్తరపోయారట. ఇదే కనుక నిజమైతే అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ సినిమాతో పూనకాలు రావటం ఖాయం.