Allu Arjun : నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాట ని రిలీజ్ చేస్తూ అల్లు అరవింద్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. నిఖిల్ సిద్ధార్ధ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా ఇదివరకే వీళ్ళు కార్తికేయ 2 సినిమాల్లో జత కట్టగా బ్లాక్ బస్టర్ జోడీ గా టాక్ సంపాదించుకున్నారు. అలాగే 18 పేజీస్ సినిమాపై భారీ అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్.

ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుండి ఏడు రంగుల వాన అంటూ కలర్ ఫుల్ పాటను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోని ఈ ఈవెంట్లో మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరణ్ గురించి ఓ రేంజ్ లో పొగిడేసారు అల్లు అరవింద్.
నాకు ఎందుకో మొదటి నుంచి అనుపమను చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది. తను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. అనుపమకి నటించడం రాదు. మనసులో ఏది ఉంటే అదే ముఖంలో కనిపిస్తుంది. అలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో రేర్ గా ఉంటారు. నాకు అనుపమను చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఇలాంటి కూతురు నాకుంటే బాగుండేది అని. ఇలాంటి హీరోయిన్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అందుకే నాకు అనుపమంటే చాలా ఇష్టం అంటూ చెప్పకు వచ్చారు. అల్లు అరవింద్ ఎటువంటి కల్మషం లేకుండా ఈ కామెంట్స్ చేసిన సోషల్ మీడియాలో మాత్రం కొందరు ట్రోలర్స్ కావాలని అల్లు అరవింద్ ని ట్రోల్ చేస్తున్నారు. అనుపమ నీ కూతురైతే బన్నీకి చెల్లెలా.. అయ్య బాబోయ్ అనుపమ లాంటి కత్తి లాంటి హీరోయిన్ ని బన్నీకి చెల్లి చేశావు కదా అరవింద్ గారు అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు.