Allu Aravind: మల్టీ టాలెంటెడ్ కమెడియన్ కం హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ చిత్రం రైటర్ పద్మభూషణ్.. ఈ సినిమా విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తుంది. మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను అందుకుంటుంది.. సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు..

అల్లు అరవింద్ ఏదైనా ఈవెంట్ గాని వచ్చి స్టేజ్ పై ఎక్కి మైక్ పట్టుకుంటే చాలు. ఏదో ఒక కొత్త విషయాన్ని చెబుతూ ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తారు. తాజాగా అలాంటి విషయాలనే మాట్లాడారు అల్లు అరవింద్ రైటర్ పద్మభూషణ్ సినిమా డైరెక్టర్ ను స్టేజ్ పై ఓ రేంజ్ లో ప్రశంసిస్తూ.. ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు రావాలి అంటూ పొగిడారు..
ఈ నేపథ్యంలో తన ఇంటి కోడలు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా చూడకముందు కూడా నాకు ఓ అభిప్రాయం ఉండేది. ఇంట్లోని ప్రతి ఆడపిల్ల ఇంటికి వచ్చిన కోడలు తో సహా ఎవరూ ఖాళీగా ఉండకూడదు. తమకాలపై వాళ్లు నిలబడాలి. ఆడపిల్లలంటే వంటింటికి పరిమితం కాకూడదని నా భావన .
ఈ సినిమా చూశాక మరింత ఎక్కువగా ఈ విషయాన్ని నేను ప్రోత్సహిస్తున్నాను. మా కోడలు స్నేహ కి పనిచేయాల్సిన అవసరం ఏముంది.. ఆమె పుట్టుకతోనే ధనవంతురాలు.. అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్ ని పెళ్లి చేసుకున్నాక మరింత ధనవంతురాలుగా మారిపోయింది. కానీ స్నేహ రెడ్డి ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉంది. అది నాకు ఎంతో గర్వకారణం. స్నేహ ఆన్లైన్ ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే అల్లు స్నేహ రెడ్డి పై అల్లు అరవింద్ చేసిన కామెంట్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి అమ్మాయి తన మనుగడ చాటుకోవాలంటే తన కాళ్ళ మీద తను నిలబడాలని.. అందుకే తన కోడల్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.