Allu Aravind : ఇదేదో విచిత్రంగా ఉందే.. కాంతార సినిమా అల్లు అర‌వింద్‌కి న‌ష్టాలు తెచ్చిపెట్టిందా?

Allu Aravind : సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార‌. హోంబలే ఫిలిం సంస్థ ఈ చిత్రాన్ని నిర్యించ‌గా, ఇందులో సప్తమి గౌడ, హీరో రిషబ్‌ శెట్టి జంటగా నటించారు. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. గీతా ఫిల్మ్‌ డిస్టిబ్యూషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 15న కాంతార ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మువీ విడుదలైనప్పటి నుంచి అంచనాలకు మించి అన్ని రికార్డులు బ్రేక్‌ చేస్తూ క‌న‌క వర్షం కురిపిస్తోంది. ఒక డబ్బింగ్‌ సినిమా ఇంతటి ఆదరణ పొందడం సినీ చరిత్రలో అద్భుతమని ప్ర‌తి ఒక్క‌రు చెప్పుకొస్తున్నారు.

allu-aravind-did-not-gets-profits
allu-aravind-did-not-gets-profits

Allu Aravind :  త‌ప్పు ప‌ని చేశాడు..

కాంతార మువీలోని ఎమోషన్స్‌ తెలుగు ప్రేక్షకులని బాగా ఆక‌ట్టుకున్నాయి. . అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ వద్ద కాంతార మువీ దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసిన‌ట్ట వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక కాంతార ఓటిటి ప్రీమియర్ నవంబర్ 18న ఉండవచ్చని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇక్క‌డ కాంతార‌కి సంబంధించిన వార్త ఒక‌టి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అల్లు అరవింద్ ఈ సినిమాని చాలా తక్కువ‌కే కొనేసి జాక్పాట్ కొట్టేశాడని అందరూ అనుకున్నారు..కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ..ఈ సినిమా కి వచ్చిన కలెక్షన్స్ లో అల్లు అరవింద్ కి గొప్ప లాభాలేమి రాలేదట.

అందుకు కార‌ణం అల్లు అరవింద్.. ఈ సినిమా తెలుగు వెర్షన్ నుండి వచ్చే షేర్ లో ఆయనకీ కేవలం పది శాతం మాత్రమే దక్కేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడ‌ట‌..ఆ లెక్క ప్రకారం అల్లు అరవింద్ కి కేవలం నాలుగు కోట్ల రూపాయిల లాభాలు మాత్రమే దక్కిందని..మిగిలిన లాభాలన్నీ ఆ సినిమా నిర్మాత హోమబుల్ సంస్థ వారికే వెళ్లాయ‌ని అంటున్నారు. ..ఒకవేళ ఈ సినిమా ని ఆయన పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ఉంటె కనీసం 20 కోట్ల రూపాయిల లాభాలు పొందేవాడ‌ని, పెద్ద త‌ప్పే చాడ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.