Pawan Kalyan : పవన్ తో విభేదాలు పై క్లారిటీ ఇచ్చిన ఆలీ..!! 

Pawan Kalyan : తెలుగు సినీ ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన కామెడీతో గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ ఆలీ. కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించారు. ఇప్పుడు పలు నటిస్తూనే బుల్లితెరపై ఆలీతో సరదాగా అనే షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో కూడా ప్రేక్షకుల ఆదరణ బాగానే పొందింది. డిసెంబర్ 19వ తేదీ కి సంబంధించి ఒక ప్రోమో తాజాగా విడుదల చేయడం జరిగింది ఇందులో యాంకర్ సుమ గెస్ట్ గా వచ్చారు.

Ali gave a clarity about with Pawan Kalyan debates..!
Ali gave a clarity about with Pawan Kalyan debates..!

ఇక పవన్ కళ్యాణ్ ఆలీ మంచి స్నేహితుల అన్న విషయం అందరికీ తెలిసిందే. పవన్ నటించిన చిత్రంలో నైనా సరే కచ్చితంగా ఆలీ ఉండాల్సిందే అనే విధంగా కండిషన్ పెట్టే వారట పవన్ కళ్యాణ్. ఇక రాజకీయాల వలన ఇద్దరు వేరువేరుగా మారారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇటీవల ఆలీ కూతురు పెళ్లికి కూడా పవన్ రాలేదు దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి.

షో కి గెస్ట్ గా వచ్చిన సుమ.. మీకు పవన్ కళ్యాణ్ కు ఎందుకు గ్యాప్ వచ్చిందని ఆలీ ని అడగగా.. అందుకు ఆలీ మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనేది అబద్ధం దీనిని బయట వ్యక్తులే సృష్టించారు ఇటీవల జరిగిన మా అమ్మాయి పెళ్లికి పిలవడానికి నేనే స్వయంగా వెళ్లాను ఆయన కూడా తప్పకుండా వస్తాను అని చెప్పారు కానీ కొన్ని కారణాలు చేత రాలేదని తెలిపారు ఆలీ.